రాఖీ పండగ - ఆ టైం దాటిన తరవాత రాఖీ కడితే దారుణాలు జరుగుతాయి .

KSK

రాఖీ పండగ .. ఎల్లుండి రాబోతున్న ఈ రాఖీ పండగ అన్నా చెల్లెళ్ళ కి ఎంతగానో ప్రత్యేకం అని అందరికీ తెలిసిందే. ప్రతీ అక్కా చెల్లీ తమ అన్నా తమ్ముళ్ళ కోసం స్పెషల్ స్పెషల్ రాఖీలు కొని కడతారు. దూరంగా ఉన్న వాళ్లకి అయితే పోస్ట్ లో పంపిస్తారు కూడా. తమ సోదరులు తమకి ఎప్పటికీ రక్షణగా ఉండాలి అని వారు కోరుకుంటూ తీపి కూడా తినిపించుకుంటారు. ప్రేమగా తమకి కట్టిన ఆ రాఖీ ని ప్రత్యామ్న్యాయం గా ప్రతీ సోదరి తో ' జీవితాంతం నిన్ను ప్రాణంగా కాపాడతాను ' అంటూ మాట ఇస్తాడు సోదరుడు.


హిందూ ధర్మం లో చాలా గొప్పగా జరుపుకునే ఈ పండగ కొందరు ఇతర మతస్తులు కూడా పాటిస్తారు. ఆగస్ట్ ఏడు న ఈ సారి రాఖీ పండగ వచ్చేస్తోంది. అయితే ఆ రోజు చంద్ర గ్రహణం కూడా ఉండడం తో ఆ రోజు అసలు రాఖీ చేసుకోవచ్చా చేసుకో కూడదా లాంటి బోలెడు ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. రాత్రి పదిన్నర తరవాత మొదలయ్యే చంద్ర గ్రహణం పన్నెండు తరవాత ముగుస్తుంది. కాబట్టి ఆ రోజు మధ్యాన్నం రెండింటి లోగానే భోజనం ముగించుకోవాలి అంటున్నారు పండితులు.


అన్నిటికంటే ముఖ్యంగా ఉదయం పదకొండు తరవాతనే రాఖీ కట్టేయ్యాలట. ఆ తరవాత రాఖీ కడితే అరిష్టం అనీ పడకూడని ఇబ్బందులు పడాల్సి వస్తుంది అనీ చెబుతున్నారు. దేవాలయాల్లో కూడా పదిన్నర కంటే ముందర ధూప దీప నైవేద్యాలు పూర్తి చేసేస్తారు. తద్దినాలు పెట్టె విషయం లో కూడా ఆ రోజు చాలా పెద్ద లేక్కుంది. మధ్యాన్నం 12 గంటల లోగా ఈ పూర్తి తతంగం ముగిసిపోవాలి అంటున్నారు. రాఖీ పండగ రోజున యజ్ఞోప వేతం ధరించేవారు సోమవారం కొత్త యజ్ఞోపవీత ధారణ చెయ్యడమే కాకుండా మంగళవారం కూడా ఇది రిపీట్ చెయ్యాలి.


రాఖీ రోజున ముఖ్యంగా రాఖీలు క‌ట్టేవారు గుర్తుంది క‌దా, ఉద‌యం 11 గంట‌ల్లోపే కార్య‌క్ర‌మాన్ని ముగించాలి..! మీ అక్కా చెల్లెళ్ళ కీ మీ ఫామిలీ లో ఉన్న అందరికీ ఈ విషయం తెలియజేయండి. వీలైనంత గా ఈ విషయాలు వారిదగ్గర షేర్ చెయ్యండి. పవిత్రమైన రాఖీ పండగ అసలు టైమింగ్ ఉదయం 11 లోగా మాత్రమె అని వారికి అర్ధం అయ్యేలా చెప్పండి. చేసుకోక చేసుకోక పండగ చేసుకుంటున్నాం దాని ఫలితం దక్కేలాగా పద్దతులు పాటించడం మంచిదే కదా !!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: