సరికాని నెలసరి నివారణకు పూర్వీకుల చక్కటి చిట్కాని...
కావాల్సిన పదార్ధాలు:
సోంపు-50 గ్రాములు,
సైందవలవణం-20 గ్రాములు,
కలకండ(పటిక బెల్లం) -25 గ్రాములు,
తయారు చేసుకునే విధానం:
ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టి వేడిచేయాలి.బాండీ వేడైయ్యాక దాంట్లో సోంపు వేసుకుకోని వేయించుకోవాలి. సోంపు వేగాకా మిక్సీ పట్టి మెత్తటి పొడిలా చేసుకోవాలి.ఇలా చేసుకున్న పొడిని జల్లించుకుని పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు ఒక చిన్న రోలు తీసుకుని దాంట్లో సైందవలవణం వేసుకుని బాగా మెత్తగా చేసుకుని పక్కకి తీసిపెట్టుకోవాలి.తర్వాత కలకండ వేసుకుని దానిని కూడా మెత్తగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు సోంపు పొడి, సైందవలవణం పొడి,కలకండ పొడి ఈ మూడు పొడులను బాగా కలుపుకోవాలి.ఇలా కలిపిన పొడిని నిలువ చేసుకుని రోజుకు ఒక గ్లాస్ నీళ్లలో ఒక స్పూన్ పొడిని కలుపుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది.లేదా ఒక స్పూన్ పొడిని డైరెక్ట్ గా నోట్లో వేసుకుని కొంచెం కొంచెం గా మింగుతూ అయిపొయాక ఒక గ్లాస్ నీళైనా తాగొచ్చు.ఇలా క్రమం తప్పకుండా 45 రోజులు చేస్తే ఈ సమస్య నుంచి మంచి ఫలితం లభిస్తుంది.