కావలసిన పదార్థాలు:
టొమాటో తరుగు - 1 కప్పు
ఉల్లితరుగు - 1/2కప్పు
క్యాప్సికమ్ తరుగు - 1/4కప్పు
పచ్చిమిర్చి: 4-6
కొత్తిమీర: 1/4కప్పు
ఉప్పు - రుచికి తగినంత, కారం - కావలసినంత శెనగపిండి - 1కప్పు బేకింగ్ సోడా - 1/4 స్నూపూన్ నూనె - వేయించడానికి సరిపడా
తయారు చేయు విధానము:
1. ఒక బౌల్లో టొమాటో తరుగు, ఉల్లితరుగు, క్యాప్సికమ్ తరుగు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు వేసి బాగా కలపాలి (ఇలా చేయడం వల్ల ముక్కలలో ఉప్పు బాగా కలిసి రుచి బావుంటుంది).
2. తరవాత అందులో కారం శెనగపిండి, సోడా వేసి పకోడీల పిండిలా కలుపుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీరు పోయాలి.
3. పాన్ లో నూనె పోసి, కాగాక టొమాటో మిశ్రమాన్ని చిన్నచిన్న పకోడీల మాదిరిగా వేసి బంగారురంగులోకి వచ్చాక తీసేయాలి. అంతే వీటిని వేడివేడిగా టొమాటోసాస్ తో తింటే చాలా బావుంటాయి.
మరింత సమాచారం తెలుసుకోండి: