చలికాలం కాబట్టి రోజూ పాలమీగడతో రెండు, మూడు నిమిషాలు ముఖాన్ని మర్థన చేయండి. కళ్ళ కింద చర్మాన్ని కొబ్బరినూనెతో రెండునిమిషాలు మసాజ్ చేయండి. పెదవులు పగలకుండా పేరిననెయ్యి, వెన్న లేదా లివ్ బామ్ ను రాయండి. బీట్ రూట్, క్యారెట్, టమోటాలు అధికంగా తీసుకుంటే దొండపండులాంటి పెదవులు మీ సొంతం అవుతాయి.
పెసరపిండి, పాలు, నిమ్మరసం, శనగపిండి, రోజ్ వాటర్ తదితరాలతో క్రమం తప్పకుండా ఫ్యాక్ లు పెట్టుకుంటే ముఖం తేటగా కోమలంగా వుంటుంది. వారానికి ఓసారి అయినా తాజా బ్రష్ తో బాగా రుద్దుకుని స్నానం చేయాలి. దీనివల్ల మృతకణాలు తొలగిపోయి, చర్మం తాజాగా వుంటుంది. స్నానం చేసే నీటిలో అరోమా నూనె చుక్కలు చేర్చి, సున్నిపిండితో నలుగు పెట్టుకుని స్నానం చేస్తే అలసిన శరీరం ఎంతో తేలికగా ఉంటుంది.
రోజు 12 నుండి 15 గ్లాసుల మంచినీళ్లు తీసుకోవాలి. పరిమిత ఆహారం ఫలప్రదం, కూరగాయలు, పెరుగు, మజ్జిగ, టెంకాయ నీళ్ళు వంటివి సమృద్దిగా తీసుకోవాలి. మాంసకృత్తులు పుష్కలంగా ఉండే పప్పు ధాన్యాలు, పాలు, గుడ్లు, తప్పనిసరి వేళ పట్టున తగినంత నిద్ర ఎంతో ముఖ్యం కనీసం రోజుకు ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి.
మరింత సమాచారం తెలుసుకోండి: