
వైయస్సార్, చంద్రబాబు సీఎం అవుతారని ముందే చెప్పాడు. ఇది జగన్ టైమ్ అంటున్నాడు..!

గతంలో నేను ఏ విధమైన ఆలోచనలు కలిగి వైయస్సార్ చంద్రబాబు అధికారం చేపడతారని చెప్పానో..ఇప్పుడు అదే విధంగా వచ్చే ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ కి జగనే ముఖ్యమంత్రి అవుతారని బలంగా చెబుతున్నానని అన్నారు సీనియర్ జర్నలిస్ట్ సీతారామ రాజ. తాజాగా ఇటీవల ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ చేసిన ఇంటర్వ్యూలో సీతారామ రాజ ఈ కామెంట్ చేశారు.

మీడియా అధికార ప్రతినిధి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ముఖ్యమంత్రి అడిగిన ప్రశ్నకు...ఆయన బదులిస్తూ నేను ఏ పెళ్లికి వెళ్లినా.. ఏ కార్యక్రమానికి వెళ్లినా రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంటుందని అడుగుతుంటా.. అది చిన్నవాళ్లయినా సరే.. పెద్ద వాళ్లయినా సరే. ఇలా ప్రతీ ఒక్కరిని అడిగి వాళ్ల నుంచి అభిప్రాయాలను సేకరిస్తుంటా. అందులో భాగంగానే.. మెజార్టీ ప్రజలు చెప్పిన సమాధానం త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికలతో మా ముఖ్యమంత్రి మారడున్నాడని, జగనే తమ ముఖ్యమంత్రి కాబోతున్నాడంటూ..! పేర్కొన్నారు.
ముఖ్యంగా ఆంధ్రాలో చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఆయా ప్రజల అభిప్రాయాల మేరకు అర్థమవుతుందని అన్నారు. ఈ పరిణామంతో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఆంధ్రాలో చాలా దారుణమైన ఫలితాలు రాబోతున్నాయని తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు జర్నలిస్టు సీతారామ రాజ.