వైరల్ ఎహే: బాహుబలిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కనిపిస్తే.. నవ్వుతూ చచ్చిపోవాల్సిందే.. !
మొదటి సారిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్లో పర్యటిస్తున్న సందర్భంగా ఇప్పుడు అందరి కళ్ళు గుజరాత్ వైపే.. ఈ పర్యటనను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం విశేషమైన ఏర్పాట్లు చేస్తోంది. కాగా ఇప్పటికే అమెరికాకు చెందిన రక్షణ దళాలు భారత్కు చేరుకుని అహ్మదాబాద్ పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీలు చేశాయి...
ఇక ట్రంప్ పర్యటనకు మరికొన్ని గంటలే మిగిలి ఉండడం తో, గుజరాత్లోని అహ్మదాబాద్ నగరం సర్వాంగ సుందరంగా మారింది. ఇందులో భాగంగా, అహ్మదాబాద్ నగరంలోని మోతేరా స్టేడియంలో జరిగే నమస్తే ట్రంప్ కార్యక్రమానికి భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇకపోతే కొందరు క్రియేటర్స్ బాహుబలిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కనిపిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో ఒక వీడియో రూపొందించారు..
కాగా వీడియోలో ఇతర పాత్రల్లో ఇవాంకా ట్రంప్, మెలానియా తదితరులు కనిపిస్తారు.. అంతే కాకుండా ‘బాహుబలి’ టైటిల్ సాంగ్ తో ఈ వీడియోను తయారు చేశారు. ఇక రేపటి నుంచి ఇండియాలో ట్రంప్ పర్యటన ప్రారంభం కానుండగా, ప్రస్తుతం ఎవరో సృష్టించిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది..
ఇకపోతే ఈ వీడియోలో ప్రభాస్, రానాల ముఖాలకు ట్రంప్ ముఖాన్ని అతికించి బ్యాక్ గ్రౌండ్ లో ‘జియోరే బాహుబలి’ పాటను జోడించారు. ఇక ఈ వీడియోలో మెలానియా, ఇవాంకాలతో పాటు ట్రంప్ కుమారుడు కూడా కనిపిస్తున్నారు. చివర్లో ‘యుఎస్ఏ అండ్ ఇండియా యునైటెడ్’ అన్న క్యాప్షన్ కూడా జతచేశారు..
ఇక ఈ వీడియో ట్రంప్ దృష్టికి వెళ్లగా ఈ ట్వీట్ పై ఆయన స్వయంగా స్పందిస్తూ, “ఇండియాలో తనకు గొప్ప స్నేహితులు ఉన్నారు” అని రీ ట్వీట్ చేయడం విశేషం. మరి నవ్వులను పూయిస్తున్న ఈ వీడియోను మీరు కూడా చూసి ఆనందించండి..