వైరల్ : న్యూస్ రిపోర్టర్ గా మారిన 7 యేళ్ళ చిచ్చర పిడుగు..

Divya

సాధారణంగా మనం చిన్న పిల్లలు అంటే వారి తెలివితేటలు కూడా ఆ వయసుకు తగ్గట్టు గానే ఉంటాయి. కానీ కొంతమంది చిన్న పిల్లలు కూడా పెద్ద వాళ్ళు చేయలేని పనులు చేస్తూ, అందరి చేత శభాష్ అనిపించుకోవదమే  కాకుండా అందరినీ  ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటారు. మొన్నటివరకు కేరళకు చెందిన ఒక 8 సంవత్సరాల బాలిక , అలాగే ఏడు సంవత్సరాల బాలుడు కేవలం ఒక గంట సమయంలో 160 రకాలకు పైగా వంటలు వండి,  గిన్నిస్ రికార్డుల్లోకెక్కిన విషయం తెలిసిందే. ఇలా చిన్న పిల్లలు తమ తెలివితేటలను ఇప్పటి నుంచే ప్రదర్శించడం మొదలు పెడుతూ ఉంటారు. ఇప్పుడు అలాంటి వారిలో ఏడేళ్ల ఒక బాలుడు కూడా సంచలనం సృష్టిస్తున్నాడు. బుజ్జి బుజ్జి మాటలతో అందరినీ ఆకర్షిస్తున్నాడు. ఇంతకు ఈ బాలుడు ఎవరు..? ఈ బాలుడు చేసిన పని ఏమిటి ..? అనే విషయాలను గురించి ఇప్పుడు మనం క్లుప్తంగా తెలుసుకుందాం.
ఈ బాలుడి పేరు రితూ.. వయసు 7 సంవత్సరాలు. కోయంబత్తూర్ జన్మస్థలం. జ్యోతి రాజ్ - ఆశా దంపతులకు జన్మించిన చిచ్చరపిడుగు. ఏడేళ్ళ వయసులోనే న్యూస్ రిపోర్టర్ గా మారి , కేవలం నాలుగు రోజుల్లోనే రెండు లక్షలకు పైగా వ్యూస్ ని సాధించాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన రితూ పేరే వినిపిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. రితూ తన చిన్న వయస్సు నుంచే, ఏ విషయాన్ని అయినా సరే ఇట్టే గ్రహించగలిగే శక్తిసామర్థ్యాలు ఉన్నవాడు. ఇక ఈ విషయాన్ని గ్రహించిన తన తండ్రి, రితూకి లాక్డౌన్ సమయంలో పూర్తిగా న్యూస్ ఛానల్ ని చూపించడం మొదలు పెట్టాడు.
ఇక అలా ఈ బాలుడు న్యూస్ ఛానల్ లో న్యూస్ రిపోర్టర్ చెప్పే మాటలను కంఠస్థం చేసి వాటిని అమలు చేస్తూ ఉండేవాడు. ఇక అలా రితూ చేస్తున్న అల్లరి వీడియోలను సేవ్ చేసి, యూట్యూబ్లో షేర్ చేసేందుకు తన తండ్రి ఒక యూట్యూబ్ పేజ్ ను కూడా ప్రారంభించాడు. కానీ రితూ కి ఏ మాత్రం నచ్చలేదు. రితూ అందుకు ఒప్పుకోకుండా, తనకు షార్ట్ స్కిట్స్ చేయాలని ఉందని తన నాన్నతో చెప్పడంతో యూట్యూబ్ పేజీలో వీడియోలు పెట్టడం ఆపేసాడు తన తండ్రి.
ఇక తండ్రి తన ఆలోచనలకు పదును పెట్టాడు. ఎలాగైనా తన కొడుకు ఆలోచనలకు కార్యరూపం దాల్చలనుకొని, ఒక ప్రయోగాత్మకంగా వీరిద్దరూ వార్తాపత్రిక పై ఒక చిన్న స్పూఫ్ స్కిట్  ను ఏర్పాటు చేశారు. ఇందులో రితూ యాంకర్ గా అలాగే రితూ ఫీల్డ్ రిపోర్టర్ గా అలాగే ఒక సామాన్యుడిగా కూడా సృష్టించారు. ఇక  ఎనిమిది నిమిషాల నిడివి కలిగిన ఒక  స్కిట్ ను సిద్ధం చేసి సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఇక  ప్రస్తుతం ఈ వీడియో రితూలో ఉన్న తెలివితేటలకు  అద్దం పడుతోంది. ఈ వీడియో లో రితూ ప్రతి పాత్రను కూడా చాలా పరిపూర్ణతతో చేయడం జరిగింది.

ఏడు సంవత్సరాల వయసులోనే తమిళ పదాలను స్పష్టంగా పలకడంతో పాటు, తమిళ రిపోర్టర్ లను తలపించేలా రితూ న్యూస్ రిపోర్టర్ గా చేస్తున్నాడు అంటూ ఎంతో మంది తమిళ ప్రేక్షకులు పొగడ్తలలో ముంచెత్తారు. ఈ సందర్భంగా రితూ మాట్లాడుతూ.." నాకు సైన్స్ అంటే చాలా ఇష్టం. భవిష్యత్తులో వ్యోమగామి అవ్వాలని నేను కోరుకుంటున్నాను.." అని చెప్పాడు. అంతేకాదు తన ఛానల్ లో ప్రస్తుతం 81వేల మంది సభ్యులు ఉన్నట్లు కూడా రితూ తెలిపాడు.

ఇక రితూ తల్లి ఆశ కూడా తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, తన కొడుకు తెలివితేటలను ప్రదర్శించడం కోసమే వారు ఇలాంటి ఆలోచన చేసినట్లు ఆమె తెలిపింది.
అంతేకాదు రితూకు సంబంధించిన వీడియోలను చేయడానికి వారు ఒక యూట్యూబ్ పేజీని కూడా ఓపెన్ చేశారని, తమడా మీడియా తో భాగస్వామ్యం కుదుర్చు కున్నామని, ఇక ఈ రోజు తన కొడుకు సాధించిన విజయాన్ని చూసి చాలా గర్వంగా ఉంది.. అంటూ రితూ తండ్రి జ్యోతి రాజ్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: