వైరల్ : తాతతో విదేశీయుడి డాన్స్?
ఇక్కడ ఓ వృద్ధుడు చేసిన డాన్స్ వీడియో కూడా అందరినీ ఆకర్షిస్తూ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. అయితే ఇక్కడ ఇప్పుడు డాన్స్ వీడియో స్పెషాలిటీ ఏమిటి అంటే ఆ వృద్ధుడి తో పాటు ఒక విదేశీ యువకుడు కూడా అదిరిపోయే డాన్స్ చేశాడు. ప్యార్ కియా తో ధర్నా క్యా హై అనే సినిమాలోని ఓ జానే జానా అనే పాట పై డాన్స్ చేశారు. ఏకంగా ఒక బస్టాండ్ ప్రాంతంలో డాన్స్ చేశారు. ఇలా వృద్ధుడితో పాటు విదేశీ యువకుడు కూడా స్టెప్పులు వేశాడు.
దీంతో ఇక బస్టాండ్ లో ఉన్న అందరూ కూడా వారిని కాసేపు విచిత్రంగా చూసారు. కానీ ఆ తర్వాత ఇద్దరి డాన్స్ ను ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు అక్కడున్న వారందరూ. ఇక వృద్ధుడు తనకు నచ్చిన విధంగా స్టెప్పులు వేయగా అటు విదేశీ యువకుడు మాత్రం పాట కు అనుగుణంగా చిందులు వేసి అదరగొట్టాడు. అయితే అక్కడే ఉన్న ఒక వ్యక్తి ఇదంతా ఫోన్లో చిత్రీకరించారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ వీడియో చూసిన వారు ఏకంగా విదేశీ యువకుడి తో పోటీపడి మరీ ఆ ముసలాయన సూపర్ గా డాన్స్ చేశారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.