వైరల్ ఎహే: కరోనా సమయంలో అనుకున్నది సాధించిన హీరో నిఖిల్.. !
లోకానికి కరోనా వైరస్ ఎక్కించిన కిక్కు కొన్ని సంవత్సరాల వరకు ప్రజలు మరచిపోరు.. ఈ సమయంలో ఎన్నో వింతలు, ఎన్నెన్నో సంగతులు ప్రతివారికి తీపి చేదు గుర్తులుగా మిగిలిపోతాయి అనడంలో సందేహం లేదు.. ఎందుకంటే ఈ కరోనా సమయంలో ఉద్యోగాలు ఊడిపోయి కొందరు ఏడుస్తుంటే.. మరికొందరు కొత్తగా నూతన జంటగా మారి జీవితాన్ని ప్రారంభిస్తున్నారు.. ఇప్పటికే కరోనా వల్ల ఎందరో పెళ్లీలు ఆగిపోయాయి.. ఇది తగ్గాక పెళ్లి చేసుకుందాం అని అనుకున్న వారిలో కొందరు ఈ రోగం తగ్గేలా లేదని, మా పెళ్లికి ఎవరు వచ్చిన రాకున్న పర్వాలేదని మూడు ముళ్లు వేస్తున్నారు..
నిజానికి కిక్ సినిమాలో రవితేజ చేసిన పెళ్లికంటే ఈ కరోనా సమయంలో పెళ్లి చేసుకున్న వారు ముసలి వారు అయి పళ్లూడిపోయిన ఈ జ్ఞాపకాలను మరచిపోరు.. ఇకపోతే టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్.. గత కొన్నాళ్లుగా భీమవరం అమ్మాయి డాక్టర్ పల్లవి వర్మతో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.. ఇక ఫిబ్రవరి 1 వ తేదీన గోవాలో పెద్దల సమక్షంలో వీరి నిశ్చితార్థం వైభవంగా జరిగింది.. ఆ తర్వాత పెళ్ళి డేటు కూడా ఫిక్స్ అయ్యింది.. ఇంతలో కరోనా రావడం.. దాంతోపాటే వీరి పెళ్ళి ఇదిగో అదిగో అంటూ వాయిదాలు పడటం.. ఇలా చెప్పి చెప్పి చివరికి విసుగెత్తినట్లుగా ఉంది.. కరోనా లేదు, లాక్డౌన్ లేదని గట్టిగా నిర్ణయించుకుని ఎట్టకేలకు నిన్న తన ప్రియురాలు పల్లవి శర్మని వివాహమాడి ఒక ఇంటివాడైయ్యాడు నిఖిల్..
ఇకపోతే మే 14 తారీఖున ఉదయం 6.30 ని.లకి నిఖిల్, పల్లవిల వివాహం జరగగా, వీరి వివాహ వేడుకకి కొద్ది మంది సన్నిహితులు, శ్రేయోభిలాషులు మాత్రమే హాజరయ్యారు. ప్రస్తుతం నిఖిల్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియోలో తెగ చక్కర్లు కొడుతున్నాయి కాగా ఇప్పుడు మనదగ్గర ఉన్న వీడియో మాత్రం నిఖిల్, పల్లవిల తలంబ్రాలకు సంబంధించిన వీడియో.. ఇక బ్యాక్గ్రౌండ్లో 'పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరిలి నవ్వీనీ పెండ్లి కూతురు' అంటూ వస్తుండగా హీరో, డాక్టర్ ఒకరి మీద ఒకరు తలంబ్రాలు పోసుకున్నారు.. ఇక నిఖిల్ ఫ్యాన్స్ మీరు ఈ దృశ్యాన్ని చూసి వీలైతే ఎంజాయ్ చేయండి..
"పీడికిట తలంబ్రాలు పెండ్లికూతురు..కొంత పడమరలి నవ్వేనే పెండ్లికూతురు 👫👑"@actor_Nikhil Tied Knot With His Lady love #Pallavi Today Morning in Hyd.#NikPal #QuarantineWedding pic.twitter.com/sv3IUwF9oK — BARaju (@baraju_SuperHit) May 14, 2020