వైరల్ ఎహే: ఓపెన్ చాలెంజ్.. సూర్యకిరణాలతో ఇంత అందంగా పెయింటింగ్ ఎవరు వేయలేరు.. !
నిజానికి ఈ సృష్టిలో మనిషి ఆలోచనలు చాలా అద్భుతం అని చెప్పవచ్చు.. వాటిని సరైన దిశలో మళ్లిస్తే ఉన్నతమైన వ్యక్తిగా గుర్తించబడతాడు.. చెడుకు ఊపయోగిస్తే చెడ్డవాడిగా కీర్తించబడతాడు.. ఇక ప్రతి మనిషిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది.. ఆ టాలెంట్‌కు సానపెడితే ఎన్నో అద్బుతాలు సృష్టించవచ్చు అని నిరూపించిన వారున్నారు.. దీనికి కావలసిందల్లా, కావలసినంత ఓపిక, పట్టుదల.. ఇకపోతే మనం ఈ ప్రపంచంలో ఎందరో కళాకారులు తమ కుంచెతో అద్భుతాలు సృష్టించడం చూశాం.. కానీ ఇప్పుడు కుంచే కాకుండా సూర్య రష్మితో చేసిన అద్భుతాన్ని చూస్తే మాత్రం మాట పడిపోవడం ఖాయం..
జనరల్‌గా పెయింటింగ్ అనగానే.. చేతిలో కుంచె, ఎదురుగా కాన్వాస్, పక్కనే రకరకాల రంగులు. పెయింటంగ్ కళాకారుని ఆయుధాలు ఇవే.. వీటిలో ఏ ఒకటి మిస్ అయినా పెయింటింగ్ వేయడం అసంభం. కానీ ఒక మహిళ కాన్వాస్ ముందు నిల్చుని సాక్షాత్తు సూర్యకిరణాలనే కుంచెగా మలుచుకుని, చేతిలో ఒక ప్లాస్టిక్ లాంటి కవర్ పట్టుకొని మహా అద్భుతాన్ని సృష్టిస్తున్నది. వివిధ పరిమాణాల్లో ఉన్న బూతద్దంలతో బొమ్మలను గీస్తూ ఇంత వరకు చూడని పెయింటింగ్‌ను చూపిస్తున్నది.. నిజానికి ఇలా బొమ్మను గీయడం అనేది ఒక అద్భుతమైన కళ.. ఇలాంటి ఆర్టిస్ట్‌లు ప్రపంచం మొత్తంలో ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ మనకు తెలిసిన వారిలో ఈ యువతి ఒకరు..
ఇకపోతే ఈ వృత్తి తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిందని, చిన్నప్పుడు వడ్రంగిగా పనిచేసే తన తండ్రి సహాయంతో మిగిలిపోయిన చెక్క దుంగలపై బూతద్దాల సాయంతో చిత్రాలను గీయడం మొదలుపెట్టి క్రమక్రమంగా దీన్నే వృత్తిగా మలుచుకున్నానని ఈ యువతి పేర్కొన్నది.. ఇక ఈ బొమ్మను వేసిన ఈ యువతి పేరు ఊరు ఎక్కడో తెలియదు గానీ ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. మీరుకూడా చూస్తే ఆశ్చర్యపోతారు..