వైరల్ ఎహే: తాను ఓడిపోయాడు.. అందరినీ పగలబడి నవ్వించాడు!
సాధారణంగా మనం చిన్నప్పుడు ఆడే ఆటల్లో ఎన్నో తప్పులు చేసేవాళ్లం.. అది చూసి పక్కవాళ్లు పగలబడి నవ్వేవారు. కాసేపు బాధ అనిపించినా.. వాళ్ల ఆనందం చూసి మనసులో నవ్వుకునేవాళ్లం. ఇలాంటి సంఘటనలు చిన్నప్పుడే కాదు పెద్దవాళ్లకు కూడా అప్పుడప్పుడు ఎదురవుతుంటాయి. తెలియక చేసిన పొరపాటైనా.. అవతలి వాళ్లకు చాలా ఫన్నీగా ఉంటాయి. కొంత మంది అత్యుత్సాహంతో ఏదో చేయబోయి అందరి ముందు అబాసు పాలవుతుంటారు. ఇక ప్రపంచంలోకి టిక్ టాక్ వీడియోలు వచ్చిన తర్వాత ఇలాంటి ఫన్నీ వీడియోలు కుప్పలు తెప్పలుగా చూస్తూనే ఉన్నాయం. తాజాగా ఓ బుడ్డోడు ఫుట్ బాల్ ని వీరలెవెల్లో తన్నాలని ప్రయత్నించి అబాసుపాలయ్యాడు. కానీ పక్కనున్న వాళ్లు మాత్రం కిందపడి బొర్లుతూ నవ్వుకున్నారు.
తన చుట్టూ పిల్లలు ఉన్నారు.. మద్యలో ఫుట్ బాల్ ఉంది.. ఆ బాల్ ని లాగి తన్నాలని ఓ బుడ్డోడు వెనక్కి వెళ్లి పరుగెత్తుకుంటూ వచ్చాడు. ఇక బాల్ ని తన్నేటప్పుడు కాళ్లు పక్కకి పోవడంతో అదుపు తప్పి కింద పడ్డాడు. ఏదో అనుకుంటే.. ఏదో జరిగిందేంట్రా బాబూ అనుకుంటూ వెంటనే పక్కన కూర్చుకున్నాడు. ఈ బుడ్డోండు అంతగా పరిగెత్తుకుంటూ రావడం చూసి బాల్ ని ఏ రేంజ్ లో తంతాడో అని ఎదురు చూసిన పక్కన ఉన్నవాడు అదుపు తప్పి కింద పడటంతో గొల్లున నవ్వుకుంటూ తెగ ఎంజయ్ చేశారు.
ఈ మాత్రం దానికి అంత దూరం వెళ్లాలా నాయనా అంటూ పడీ పడీ నవ్వారు. కానీ తాను ఓడినా అంత మంది పిల్లలను ఆనంద పరిచాడు. 'ఈ కథ యొక్క నైతికత: ఇది మీ పరుగుల పొడవు గురించి కాదు !! ప్రతిఒక్కరూ ఈ రోజుని ఆనందించండి' అని నవ్వుతున్న రెండు ఎమోజీలను జోడించి జో మోరిసన్ ట్విట్టర్లో షేర్ చేశాడు. ఇప్పుడు ఇది బాగా హల్చల్ చేస్తున్నది.
The moral of this story: it’s not about the length of your run up!! Enjoy your day everyone 😂😂pic.twitter.com/hnZVnHZhDt — Joe Morrison (@joefooty) June 17, 2020