ఇక మళ్ళీ హైదరాబాద్ లో ఇదే వర్షం రిపీట్ అవ్వబోతుందా...??

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. నిన్న ఎవ్వరు గతంలో కనీ వినీ ఎరుగని విధంగా వర్షం పడింది. హైదరాబాద్ జనాలు ఈ వర్షం వల్ల చాలా తంటాలు పడ్డారు. రోడ్లన్నీ సెలయేరుల్లా  మారిపోయాయి. మెట్రో పిల్లర్ల నుంచి వర్షపు నీరు నయాగరా ఫాల్స్ లాగ పారాయి. కొన్ని చోట్ల వర్షం తాకిడికి పెద్ద పెద్ద చెట్లు కూడా విరిగి పోయాయి. అలాగే కరెంట్ స్థంబాలు కూడా కూలిపోయాయి. కరెంటు వైర్లు తెగి పోయి రోడ్ల మీద వున్నా నీటిలో పడిపోయాయి. ఈ భారీ వర్షాలు, వరదలు తెలంగాణను అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరం వణికిపోతోంది. మూసీ ఉగ్రరూపం దాల్చింది.ఇప్పటి వరకు వర్షాలు, వరదల కారణంగా గత రాత్రి నుంచి 15 మంది చనిపోయినట్టు ఏఎన్ఐ వార్తా సంస్థ ప్రకటించింది.

 జనాలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రోడ్లలో వాటర్ నిలిచిపోవడం వల్ల వాహనాలు అన్ని ఎక్కడికి అక్కడే  నిలిచిపోయాయి. వర్షానికి కోపం వస్తే ఎలా ఉంటుందో నిన్న జరిగిన ఈ దుర్ఘటన జీవితంలో మరిచిపోలేని ఒక  ఉదాహరణ.

మంగళవారం నాడు కురిసిన వర్షానికి ఈ ఒక్కరోజు బ్రతికితే చాలు దేవుడా... అనే పరిస్థితి వచ్చింది. కొన్ని చోట్ల అయితే మ్యాన్ హోల్స్ నిండిపోయాయి. చాలా చోట్ల ప్రాణ నష్టం కూడా జరిగింది. తెలంగాణలో వర్షాలు, హైదరాబాద్‌లో పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. తెలంగాణలో ముఖ్యంగా... హైదరాబాద్‌లో ఎప్పుడూ లేనంత భారీ వర్షం పడటం వల్ల... ఎక్కడికక్కడ బస్తీలు, కాలనీలూ మునిగిపోవడంతో... ఔటర్ రింగు రోడ్డు పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాలకూ రెండ్రోజులు సెలవులు ప్రకటించారు.ఇక ఇప్పట్లో ఈ వర్షం తగ్గుతుందా అనుకుంటే... ఇంకా రెండుమూడు రోజులు వర్షాలు ఇలాగే కొనసాగే ప్రమాదం ఉందని అంటున్నారు. ఇక జనాలకు కరోనా భయం పొయ్యి ఈ వర్షాల భయం పట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: