కంట తడి పెట్టించే ఘటన.. సాటి మనిషి అని చూడకుండా దారుణంగా కొట్టారు....

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ వైరల్ న్యూస్ చదవండి...  కలికాలం ఇదేనని మరోసారి రుజువైంది. మనుషుల్లో మానవత్వం చచ్చిపోయింది అనేదానికి ఇది ఓ నిదర్శనం.. ఇక వివరాల్లోకి వెళితే.. ఒక పేద ఆటో డ్రైవర్.. బాగా బలిసిన రాక్షసులతో పెట్టుకున్నాడు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన చూస్తే రక్తం ఉడికిపోతుంది. ఓ యువతి స్కూటీని ఆటో ఢీకొట్టింది. దీంతో ఆటోడ్రైవర్‌తో ఆ యువతి వాగ్వాదానికి దిగింది.

ఈ విషయాన్ని ఆమె తన స్నేహితులకు ఫోన్ చేసి చెప్పింది. దీంతో నలుగురు వ్యక్తులు అక్కడికి వచ్చారు. ఆటో డ్రైవర్‌ను కాళ్లతో తన్నుతూ అత్యంత దారుణంగా కొట్టారు. మరో వ్యక్తి అతడిని కిందపడేసి.. భవన నిర్మాణాలకు ఉపయోగించే ఇనుప షీట్లతో కొట్టాడు. దీంతో అతడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అయినా సరే.. అతడు వదలకుండా ఆటో డ్రైవర్ జుట్టుపట్టుకుని కొడుతూనే ఉన్నారు. చివరికి బైకు మీద అడ్డంగా పడుకోబెట్టి తీసుకెళ్లిపోయారు.

అతడు అంత దారుణంగా కొడుతుంటే ప్రజలెవరూ పట్టించుకోలేదు. ఎప్పటిలాగానే వీడియోలు తీసుకుంటూ వినోదం చూశారు. అయితే, ఈ వీడియోలు మరో రకంగా ఉపయోగపడ్డాయి. ఆ వీడియోలు వైరల్ కావడంతో పోలీసులు ఆ నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు నిందితులను రోడ్డుపై నడిపించుకుంటూ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.

ఇద్దరిలో తప్పు ఎవరిదైనా కావచ్చు.. కానీ, చట్టాన్ని చేతుల్లో చేసుకోవడం నేరమని పోలీసులు వెల్లడించారు. నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేశామని, ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆటోడ్రైవర్ పరిస్థితికి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో కంట తడి పెట్టిస్తుంది. యు ట్యూబ్ లో వైరల్ అవుతుంది. ఆ ఆటో డ్రైవర్ ని అత్యంత కిరాతకంగా కొట్టిన ఆ దుండగులను దారుణంగా శిక్షించాలని నెటిజనులు మండి పడుతున్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: