అది 'భగీర'నేనా...?

RAVI TEJA
" data-original-embed="" >
"భగీరా" ఈ పేరు అందరికీ తెలిసేవుంటుంది. హాలీవుడ్ సినీ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన జంగిల్ బుక్ చిత్రంలోని నల్ల చిరుత. ప్రస్తుతం భారత్ అడవుల్లో సంచరిస్తుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీనికి సంబంధించిన ఓ వీడియోని తాజాగా ఓ అటవీ అధికారి ట్వీటర్ లో పోస్ట్ చేశారు. క్షణాల వ్యవధిలోనే వేల సంఖ్యలో ఆ వీడియోని నెటిజన్లు వీక్షించారు.
వివరాల్లోకి వెళ్తే ...ఐఎఫ్ ఎస్ అధికారి పర్వీన్ కస్వాన్ నల్ల చిరుత కు సంబంధించిన వీడియో ట్విటర్ లో పోస్ట్ చేశారు. రహదారి పక్కగా వెళ్తున్న  వాహనంలో ఉన్న అటవీ సిబ్బంది ఆ వీడియోని మొబైల్ తో చిత్రీకరించారు. వాహనం చిరుతని సమీపించేలోగా అది అడవిలోకి వెళ్లిపోయింది. దీన్ని  " భారత దేశపు నల్ల చిరుత. ప్రదేశం బహిర్గతం చేయలేము" అని టాగ్ లైన్ తో పర్వీన్ ట్వీటర్ పోస్ట్ చేశారు. కచ్చితంగా ఎక్కడుందో చెప్తే అందరికీ తెలిసిపోతుందనే ఆ చిరుత ఆచూకీని గోప్యంగా ఉంచుతున్నట్లు ఆయన వివరించారు. పర్వీన్ అప్లోడ్ చేసిన వీడియోపై నెటిజన్లు భారీగా స్పందిస్తున్నారు. 'బ్లాక్ బ్యూటీ' అంటూ కామెంట్లు చేస్తున్నారు. అక్టోబర్ 24 న పోస్ట్ చేసిన ఈ వీడియోని ఇప్పటికే లక్షల మంది వీక్షించారు.  ఈ రకం నల్ల చిరుతలు ఎక్కువగా ఆసియా, ఆఫ్రికా ఖండల్లో ఎక్కువగా ఉంటాయి. దక్షిణ భారతదేశంలోని రక్షిత అడవుల్లో ఇవి అరుదుగా కనిపిస్తుంటాయి. గతంలో మహారాష్ట్ర లోని తబోద అంధారి జాతీయ పార్క్ లో అభిషేక్ అనే ఇంజనీరింగ్ విద్యార్థి 20 అడుగుల దూరం నుంచే నల్ల చిరుతని ఫోటో తీశాడు.
షా జంగ్ అనే వైల్డ్ ఫోటోగ్రాఫర్ కర్ణాటక లోని కబిని అడవుల్లో సయ నల్ల చిరుత ఫోటోలు తీశాడు. దీనికోసం జంగ్ 5 ఏళ్ళు తీవ్రంగా శ్రమించాడు.  పర్వీన్ పోస్ట్ చేసిన వీడియోతో నల్ల చిరుతల సంచారం అధికంగానే ఉన్నట్లు స్పష్టంమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: