వైరల్ అవుతున్న బిగ్ బాస్4 హోస్ సెట్ డ్రోన్....
డ్రోన్ కెమేరాతో తీసిన ఈ వీడియో.. నెటిజనులను ఆకట్టుకుంటోంది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఈ సెట్‌ను నిర్మించిన సంగతి తెలిసిందే. మనం టీవీ చానెల్‌లో చూసినట్లుగా నాగార్జున హోస్ట్ చేసే.. స్టూడియో, బిగ్‌బాస్ సెట్.. రెండూ కలిసి ఉండవనేది ఈ వీడియో ద్వారా తెలుస్తోంది.
బిగ్‌బాస్ హౌస్ సెట్‌కు పక్కనే ఉన్న మరో సెట్‌లో బిగ్‌బాస్ హోస్ట్ నాగార్జున వీకెండ్ ఎపిసోడ్లు షూట్ చేస్తారని.. ఈ వీడియోలోని వ్యాఖ్యాత వివరించారు. ప్రముఖ టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ హోస్ట్‌గా.. ‘బిగ్‌బాస్ తెలుగు’ సీజన్-1.. జులై 16, 2017లో మొదలైంది. ఇప్పటికే మూడు సీజన్లను విజయవంతంగా ముగించుకుని.. నాలుగో సీజన్‌లోకి అడుగు పెట్టింది. అయిగే, బిగ్‌బాస్ సీజన్-1 సెట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయలేదు. ముంబయిలోని లోనవాలాలో సెట్ వేశారు. ఆ సీజన్‌లో నటుడు శివబాలాజీ బిగ్‌బాస్-1 విజేతగా నిలిచారు. బిగ్ బాస్-2 విజేతగా కౌశల్, బిగ్ బాస్-3 కి రాహుల్ సిప్లిగంజ్ లు విజేతలుగా నిలిచారు. ఇక 4వ సీజన్ లో ఎవరు విన్ అవుతారో ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే...