ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తున్న ప్రభాస్ ఆదిపురుష్ పోస్టర్... మరీ ఇంత క్రేజా?

Purushottham Vinay

ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. భారతదేశ బాహుబలి ప్రభాస్ వరుస సినిమాలు లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే ‘రాధే శ్యామ్’ షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్న ప్రభాస్ ఆ తరువాత ‘ఆదిపురుష్’, ఆ వెంటనే నాగ్ అశ్విన్ సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం ‘ఆదిపురుష్’ మేకర్స్ ప్రభాస్ కోసం హీరోయిన్ ని వెతికే పనిలో పడ్డారు. ప్రభాస్ చేస్తున్న తొలి డైరెక్ట్ హిందీ సినిమా ఇదే కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది నుండి మొదలుకానుంది.

బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనుండగా.. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ రావణుడి రోల్ పోషించబోతున్నారు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి రాముడి లుక్ లో ప్రభాస్ ఎలా కనిపించబోతున్నాడనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఇప్పటికే రాముడిగా ప్రభాస్ ని ఊహిస్తూ అనేక ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ వచ్చాయి. తాజాగా ఓ అభిమాని రాముని గెటప్ లో ప్రభాస్ లుక్ ఇలా ఉంటుందంటూ యానిమేషన్‌లో ఓ లుక్‌ను తయారు చేసి పోస్ట్‌ చేశాడు.అలా పోస్ట్ చేసాడో లేదో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. 

ఆ పోస్టర్లో ప్రభాస్ సముద్రపు ఒడ్డున 6 ప్యాక్ బాడీతో సూర్య కాంతి వెలుగులో గంభీరంగా నుంచొని సింహంలా చూస్తున్నాడు.. ఆ పిక్ కి ప్రభాస్ ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. సోషల్ మీడియాలో ఆ పిక్ ని తెగ వైరల్ చేస్తున్నారు. ఇక ఈ ఫ్యాన్ మేడ్ పోస్టర్ తో ఆదిపురుష్ టీం కి పెద్ద సమస్య వచ్చి పడింది. ఎందుకంటే వారు ఇప్పుడు ప్రభాస్ ని ఇంతకన్నా అద్భుతంగా చూపించే పనిలో పడ్డారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: