కాలి పట్టీ వల్ల చిన్నారి ప్రాణం పోయింది.. కాలికి ఉన్న పట్టీ వల్ల ప్రాణం ఎలా పోతుంది అనుకుంటున్నారా..అవును నిజంగానే ప్రాణం పోయింది..ఆడుకుంటూ ఉంటున్న ఆ చిన్నారి కాలికి ఉన్న పట్టీ ఎక్కడో పోయింది.. దాంతో భయపడిపోయి ఇంట్లో తెలిస్తే కొడతారెమో అని ఏడ్చేసింది.. ఇంటికి వెళ్ళాలంటే భయంతో వణికిపోయింది..చివరికి ప్రాణాలను తీసుకుంది.. పట్టీ గురించి చెప్పక పోతే ఇంట్లో అమ్మ కొడుతుందని ప్రాణాలను విడిచింది.. చిన్నారి మరణానికి పట్టీ కారణమని తల్లి దండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు..ఈ విషాద సంఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది..
వివరాల్లోకి వెళితే.. ఈ అమానుష ఘటన ఆంధ్ర ప్రదేశ్ గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది..కాలిపట్టీ ఆమె పాలిట శాపంగా మారింది. ఆడుకుంటూ ఎక్కడ పోగొట్టుకుంది, దాంతో కన్న తల్లి ఆగ్రహానికి గురైంది. పట్టీ కోసం అమ్మ తిట్టిందని మనస్థాపానికి గురైన తొమ్మిదేళ్ల బాలిక అఘాయిత్యం చేసుకుంది. విషం తిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. సత్తెనపల్లి పరిధిలోని ముప్పాళ్ల మండలం ఇరుకుపాలెం గ్రామానికి చెందిన బాలిక ఆడుకుంటూ తన పట్టీ పోగొట్టుకుంది. అది ఆమె తల్లికి తెలియడంతో పట్టీ పోగొట్టినందుకు బాలికని తీవ్రంగా మందలించింది.రెండు దెబ్బలు కూడా కొట్టింది.. అమ్మ బాగా కొడుతుందని ఆలోచించి ప్రాణాలను తీసుకుంది..
అమ్మ బాగా తిట్టి, కొట్టిందని బెంగతో తీవ్ర మనస్తాపానికి గురి అయింది..క్షణం కూడా ఆలోచించకుండా టమాటాలో ఎలుకల మందు పెట్టుకుని తినేసింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో గుంటూరు జీజీహెచ్‌కి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బాలిక ప్రాణాలు విడిచింది. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆమె వారం రోజుల కిందట ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. బాలిక ఆస్పత్రిలో మరణించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఒక్కగానొక్క బిడ్డ ప్రాణాలను విడవడం తో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.. గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి..