స్నేహం అంటే ఇదేరా..!! ఒక స్నేహితుడు కి ఇల్లు కట్టించిన స్నేహితులు...!!

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ న్యూస్ చదవండి.. స్నేహం అంటే ఇదేనేమో..! ఎంత డబ్బున్న కాని స్వార్ధంగా బ్రతికే మనుషులు వున్న ఈ రోజుల్లో కష్టాల్లో వున్న ఒక నిరుపేద స్నేహితునికి మేమున్నాం అంటూ అతని స్నేహితులు ఏకంగా అతనికి ఇల్లునే కట్టించారట. పూర్తి వివరాల్లోకి వెళితే....44 ఏళ్ల ముత్తుకుమార్ ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కరోనా వైరస్ కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్.. ముత్తును కష్టాల్లోకి నెట్టేసింది. లాక్‌డౌన్‌కు ముందు ముత్తు నెలకు రూ.10 వేలు నుంచి రూ.15 వేలు సంపాదించేవాడు. లాక్‌డౌన్ తర్వాత ఆ మొత్తం రూ.వెయ్యి నుంచి రూ.2వేలకు పడిపోయింది. 2018లో గజా తుఫాన్ వల్ల అతడి గుడిసె బాగా దెబ్బతింది. ఆర్థిక సమస్యల వల్ల ముత్తు ఆ గుడిసెకు మరామ్మతులు చేయించలేదు. అప్పటి నుంచి కూలిపోయే స్థితిలో ఉన్న ఆ గుడిసెలోనే నివసిస్తున్నాడు.

ముత్తు కుమార్ సెప్టెంబర్ నెలలో తమ స్కూల్ ఉపాధ్యాయుడి ఇంటికి వెళ్లాడు. అక్కడ తన స్కూల్ ఫ్రెండ్ కె.నాగేంద్రన్‌ను కలిశాడు. ఈ సందర్భంగా ముత్తు కుమార్ నాగేంద్రన్‌ను తన ఇంటికి ఆహ్వానించాడు. ముత్తు ఇంటిని చూసిన నాగేంద్రన్‌కు గుండె పగిలినంత పనైంది. దీంతో ముత్తుకు సాయం చేయాలని నాగేంద్రన్ నిర్ణయించుకున్నాడు. ఆ ఇంటి ఫొటోలు తీసి తమ స్కూల్ వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేశాడు. దీంతో మిగతా స్నేహితులు సైతం ముత్తుకు సాయం చేయడానికి ముందుకొచ్చారు.

స్నేహితుల నుంచి సేకరించిన 1.5 లక్షలతో కేవలం మూడు నెలల్లోనే ఇల్లు కట్టి ముత్తూకు ఇచ్చారు. ఇందులో చిత్రమైన విషయం ఏమిటంటే.. ముత్తు స్నేహితులు ఇంజినీర్ల సాయం లేకుండానే స్వయంగా ఆ ఇల్లు నిర్మించారు. దీపావళి కానుకగా ఆ ఇంటిని ముత్తుకు అందించారు. ఆ ఇంటికి సమీపంలోనే ముత్తు తల్లి కోసం ప్రత్యేకంగా ఒక గుడిసె కూడా నిర్మించారు.నిజంగా వీళ్ళు స్నేహానికి విలువనిచ్చి కష్టాల్లో వున్న స్నేహితునికి అండగా నిలిచినందుకు చాలా మంది మెచ్చుకుంటున్నారు. స్నేహమంటే ఇదేరా అంటూ వారిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇలాంటి మరెన్నో వైరల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: