వైరల్ అవుతున్న ముద్రగడ పద్మ నాభం వ్యాఖ్యలు....

Purushottham Vinay

ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. దేశవ్యాప్తంగా రైతులు ఉద్యమం చేపడుతున్నారు. ఇక రైతులు చేపట్టిన ఉద్యమంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి  మాజీ మంత్రి  ముద్ర గడ పద్మ నాభం లేఖ రాశారు. రైతులు చేస్తున్న ఉద్యమం పట్ల పట్టుదలకు పోకుండా మనసు పెట్టి ఆలోచించాలని కోరటం జరిగింది. చట్టాలు చేయాల్సింది..అడుగున పడిన వర్గాల కోసమే కానీ, పారిశ్రామిక వర్గాల ప్రయోజనం కోసం కాదని ముద్రగడ తేల్చి చెప్పటం జరిగింది...

రైతుల సమస్యను నరేంద్ర మోడీ దృష్టికి తెస్తున్నందుకు తనను దేశద్రోహిని అనుకోవద్దని లేఖలో ముద్రగడ పద్మనాభం తెలపడం జరిగింది. దేశ ప్రజల సమస్యలు ప్రధాన మంత్రికి కాకపోతే ఇంకెవరికి చెప్పుకుంటారని ప్రశ్నించారు. రైతులు ఉద్యమం చేయడం నరేంద్ర మోడీ మనసును నొప్పించి ఉంటే వారిని పెద్ద మనసుతో క్షమించాలని కోరారు.

ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు కొరకు రైతులు ఇప్పటికే చాలా మెట్లు దిగి కేంద్ర ప్రభుత్వం వద్దకు వచ్చారని ముద్రగడ్డ పద్మనాభం పేర్కొనటం జరిగింది. రైతుల కోసం నరేంద్ర మోడీ గారు ఒక మెట్టు దిగినా తప్పులేదని ప్రధాని మోదీని కోరారు. దాని వల్ల ప్రధాని గారి కీర్తి కలకాలం ఉంటుందని ముద్రగడ లేఖలో పేర్కొనటం జరిగింది. దేశానికి అన్నదాత వెన్నెముక అంటారని, అలాంటి అన్నదాతను కాపేడేలా ప్రధాని నరేంద్ర మోడీగారు నిర్ణయాలు ఉండాలని ముద్రగడ పద్మనాభం లేఖలో కోరారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.ఇలాంటి మరెన్నో వైరల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో వైరల్ న్యూస్ ల గురించి తెలుసుకోండి....

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: