వైరల్ అవుతున్న కానిస్టేబుల్ లీవ్ లెటర్.. సెలవు ఇవ్వకపోతే భార్యతో గొడవట..!!

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ వైరల్ న్యూస్ చదవండి....మనం ఎన్నో లీవ్ లెటర్ లని చూసి ఉంటాము. కాని ఇలాంటి లీవ్ లెటర్ ని ఎప్పుడు చూసి ఉండము.వివరాల్లోకి వెళితే... భోపాల్‌  సిటీలో ట్రాఫిక్  కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న దిలీప్ కుమార్ అహిర్వార్.. తన భార్య బంధువు పెళ్లికి హాజరయ్యేందుకు సెలవు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ సందర్భంగా తన పైఅధికారికి లీవ్ లెటర్ రాశాడు. ఇక ఆ లీవ్ లెటర్ చూసి అధికారి షాకయ్యాడట.. మొదటి  పేరాలో అన్నీ బాగానే రాసినా.. చివరి పేరాలో మాత్రం... ఇలా చెప్పాడు...‘‘నేను నా భార్య బావ పెళ్లికి హాజరుకాకపోతే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని నా భార్య హెచ్చరించింది’’ అని తెలిపాడు.




ఈ లీవ్ లెటర్ చూసిన అతని పై అధికారి దాన్ని క్రమశిక్షణరాహిత్యంగా భావించారు. అతడికి సెలవు ఇవ్వలేదట. ఇందుకు శిక్షగా అతడికి పోలీస్ లైన్స్‌కు బదిలీ చేశారు. అయితే, అహిర్వార్ నా లేఖలో తప్పేముందో చెప్పండి అంటూ.. దాన్ని వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేశాడు. దీంతో అది క్షణాల్లో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజనులు స్పందిస్తూ.. ఇందులో తప్పేముందని అతడిపై చర్యలు తీసుకున్నారని ప్రశ్నిస్తున్నారు. అతడు తన సమస్యను లేఖలో చెప్పుకున్నాడని , క్షమించి సెలవు  ఇవ్వాల్సిందని మరికొందరు అంటున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ గా మారింది. ఇక ఇలాంటి మరెన్నో వైరల్ వార్తల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: