వైరల్ అవుతున్న సుకుమార్ కామెంట్స్....
ఇప్పటి వరకూ తీసిన సినిమా చాలా పర్ఫెక్ట్ గా వచ్చిందని అంటున్నారు. షూటింగ్ రష్ ని చూసిన దర్శకుడు సుకుమార్ చాలా సంతోషంగా ఉన్నాడట. లేటుగా సినిమాని మొదలుపెట్టినా మధ్యలో అవాంతరాలు వచ్చినా షూటింగ్ అనుకున్న విధంగానే సాగుతోందని, ఏదైతే అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్ ఉందో అది సూపర్బ్ గా వస్తోందని టాక్ వినిపిస్తోంది. ఇక రీసంట్ గా ఈ సినిమా ఫోటోగ్రాఫర్ చనిపోవడం, అలాగే వీడియో సాంగ్ ఒకటి లీక్ అవ్వడం ఇవన్నీ కూడా సినిమా అవుట్ పుట్ పై ఎలాంటి ప్రభావం పడట్లేదని సుకుమార్ వైరల్ కామెంట్స్ చేశాడు.
ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రంపచోడవరం లో జరుపుకుంటోంది.బన్నీ ఇంట్రడక్షన్ సాంగ్ మీద చిత్రీకరణ సాగుతోంది. దీనికి సంబంధించిన వీడియోనే లీక్ అయ్యింది. ఇప్పుడు ఇది చిత్రయూనిట్ తేలికగా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో సినిమాని ఆగస్టు 13 న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి కష్టపడుతున్నారు. ఈ సినిమాలో రష్మిక ఒక గిరిజన అమ్మాయిగా కనిపించబోతోందని టాక్. ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తూ అల్లు అర్జున్ మార్కెట్ ని పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారట.