ఇండస్ట్రీలో వైరల్ అవుతున్న వరంగల్ శ్రీను.. ఏకంగా దిల్ రాజుకే పోటీ ఇస్తున్నాడుగా....!!
ఇప్పుడు వరంగల్ శ్రీను టాపిక్ చర్చల్లోకి వచ్చి మరోసారి వైరల్ అవ్వడానికి కారణం ‘ఆచార్య’ సినిమా. అవును మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’సినిమానే. ఈ సినిమా నైజాం హక్కులను వరంగల్ శ్రీను కొనుగోలు చేశాడని టాక్. ఏకంగా ₹40 కోట్లు పెట్టి వరంగల్ శ్రీను ‘ఆచార్య’ నైజాం హక్కులు సొంతం చేసుకున్నాడట. దీంతో దిల్ రాజుకు వరంగల్ శ్రీను దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడని టాలీవుడ్లో టాపిక్ వైరల్ అవుతుంది. ఈ సినిమా కోసం దిల్ రాజు కూడా పోటీ పడినప్పటికీ వరంగల్ శ్రీను పెద్ద మొత్తం ముందు పెట్టి ఓకే చేయించుకున్నాడట.
‘ఆచార్య’ నైజాం హక్కులు వరంగల్ శ్రీనుకు దక్కడానికి వెనుక కొరటాల శివ కూడా ఉన్నాడని అంటున్నారు. ‘భరత్ అనే నేను’ సినిమా సమయంలో దిల్ రాజు – కొరటాలకు మధ్య చిన్న డిస్ట్రబెన్స్ వచ్చిందట. దాని వల్లే ‘ఆచార్య’ వరంగల్ శ్రీనుకు వెళ్లిందంటున్నారు. ఈ లెక్కన వరంగల్ శ్రీను పంతం నెగ్గి పెద్ద సినిమా పట్టేశాడు.ఇక నైజాం కింగ్ దిల్ రాజునే తట్టుకొని నిలబడ్డాడు అంటే నిజంగా ధైర్యం అనే చెప్పాలి.