ప్రస్తుతం పెళ్లికి ముందు ఫోటో షూట్ కంపల్సరీ అయిపోయింది. ఎవరి రేంజ్ కు తగ్గట్టు వాళ్ళు ప్రీ వెడ్డింగ్ షూట్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. కొంతమంది వేల రూపాయలు ఖర్చు చేసి ఫోటో షూట్ లు చేసుకుంటుంటుంటే..కొంతమంది ఫోటో షూట్ ల కోసం లక్షల్లో ఖర్చు పెడుతున్నారు. అంతే కాకుండా ఒక్కో జంట ఒక్కో స్టైల్ లో ప్రీ వెడ్డింగ్ షూట్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక ఫోటో షూట్ లలో ఫోటో గ్రాఫర్ లు తమ క్రియేటివిటిని ప్రదర్శిస్తూ కొత్త కొత్త స్టిల్స్ తో కొత్త జంటలను ఆకట్టుకుంటున్నారు. ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అన్నట్టు ఫోటోలకు పోసులిచ్చేవాళ్ళు కూడా ఫోటో గ్రాఫర్ ఎంత చెబితే అంత అన్నట్టుగా స్టిల్స్ ఇస్తున్నారు. ఇటీవల ఒక జంట కేరళలో ఫోటో షూట్ కోసం వెళ్లి సరస్సులో పడిపోయింది. నాటు పడవలో ఫోటో షూట్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక తాజాగా ఓ ప్రీవెడ్డింగ్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వింత జంట శుభమా అని పెళ్లి చేసుకుంటూ శవల్లా ఫోటోలకు పోసులిచ్చింది. ఓ నదీ తీరంలో నల్ల దుస్తుల్లో జంట నీటి పై తేలుతూ ఉంది. ఫోటోల్లో ఇద్దరి బాడీలు నీళ్ళపై తేలుతూ ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఆ బాడీలను తాళ్లతో కట్టి..పైన పుల్లలు వేశారు. ఒకేసారి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకుని ఒడ్డుకు కొట్టుకు వచ్చినట్టుగా కనిపిస్తున్నాయి. ఈ ఫోటో షూట్ పేరు "లవర్స్ సూసైడ్" థీమ్ అంట. ఇక ప్రస్తుతం ఈ ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఫోటోలను చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇదెక్కడి ఫోటో షూట్ రా బాబు అని కామెంట్లు పెడుతున్నారు. మరోసారి కొందరు పిచ్చి ముదిరితే ఇలానే ఉంటుందని అంటున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: