దొంగోడి స్కెచ్ అదుర్స్.. వామ్మో ఇన్ని తెలివి తేటలా.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే!
టెక్నాలజీ సాయంతో అనేక చోట్ల దొంగతనాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. దొంగలను పట్టుకోవడానికి కూడా ఈ వీడియోలు ఉఫయోగపడుతున్నాయి. అంతేకాదు, ఆ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండడంతో తెగ వైరల్ కూడా అవుతున్నాయి. ఆఫీసులో ఉద్యోగులంతా ఉన్నారు. వాళ్ల ఎదుట నోట్ల కట్ట ఉంది. కానీ దానిని ఏదో అవసరం కోసం అక్కడ ఉంచి, అంతా లెక్కలు వేసుకుంటున్నారు.
ఓ వ్యక్తి పుస్తకంలో లెక్కలు చూసుకుంటుంటే.. మరో వ్యక్తి ఏదో పనిలో ఉన్నాడు. ఇంతలో అక్కడకికి ఓ వ్యక్తి వచ్చాడు. అక్కడున్న వారిని ఏదో అడిగాడు. అలా అడుగుతున్న సమయంలోనే అతడి దృష్టి నోట్ల కట్టపై పడింది. అంతే, దానిని ఎలాగైనా నొక్కేయాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా.. తన టాలెంటుకు పని చెప్పాడు.
ఒక చేతితో ఏవో పేపర్లు చూపిస్తూ మరో చేతితో ఆ నోట్ల కట్టను నొక్కేశారు. ఇంతటి తెలివితో నొక్కేయడంతో ఎవరికీ అనుమానం రాలేదు. తర్వాత అతడు వెళ్లిపోయాడు. కొంతసేపటికి డబ్బుల విషయం గుర్తుకువచ్చి, అంతా వెతికారు. ఉంటే కదా దొరికేంది. అప్పుడే వారికి ఆఫీస్లో ఉన్న సీసీ కెమెరా గుర్తుకొచ్చింది. అందులో చూడడంతో అసలు విషయం బయటపడింది. దొంగ దొరికిపోయాడు. అయితే దొంగిలించిన తీరును చూసి అక్కడున్న వాళ్లు అవాక్కయ్యారు.