ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..ఈ భూమ్మీద విచిత్రమైన జంతువులలో కోతులు కూడా ఒకటి. వాటి పనులు కాని రూపం కాని ఇంకా చేష్టలు కాని అన్నీ కూడా మనుషులను పోలీ ఉంటాయి.అవి చేసే పనులు చాలా సరదాగా నవ్వు తెప్పించే విధంగా ఉంటాయి. అలాగే అవి చూడ్డానికి చాలా ముద్దుగా ఆకట్టుకుంటాయి.ఇక అలాంటి పనిని ఇవి చేశాయి. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో అవి చేసిన ఈ పని ఎంతగానో ఆకట్టుకుంటుంది....
ఎవరైనా మనుషులు అల్లరి చేస్తున్నా, క్రమశిక్షణతో లేకపోయినా.. ఆ కోతి చేష్టలు తగ్గించుకోవాలని మన పెద్దలు కాని టీచర్లు కాని చెబుతుంటారు. అయితే, ఈ కోతులను చూసిన తర్వాత ఆ అభిప్రాయం మార్చుకుంటారు. ఆ కోతులను చూసైనా నేర్చుకోండి రా.. అని తిట్టినా ఆశ్చర్యపోవక్కర్లేదు. సోషల్ మీడియాలో ట్రెండవ్వుతున్న ఈ వీడియో ఇప్పుడు నెటిజనులు విశేషంగా ఆకట్టుకుంటోంది.ఇంకా తెగ వైరల్ అవుతుంది...ఇక మనం చూసినట్లయితే ఇందులో ఉన్న ఓ కోతుల గుంపు మధ్య ఎవరో పెద్ద కేకును వదిలిపెట్టి వెళ్లారు. అయితే, ఆ కోతులు కలబడి కొట్టుకోకుండా.. ఎంతో క్రమశిక్షణతో ఆ కేకును తిన్నాయి.అక్కడ పదుల సంఖ్యలో కోతులు ఉన్నా.. ఎలాంటి గొడవలు లేకుండా ఆ కేకును తిన్నాయి. కొన్ని చేతులతో కొంచెం కొంచెం తీసుకుని తింటుంటే, మరికొన్ని నేరుగా నోటితో కొరుక్కుని తినడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. ఎంతో బుద్ధిగా కంగారు లేకుండా ప్రశాంతంగా అవి కేక్ పార్టీ చేసుకున్నాయి.వీటి ప్రవర్తన చూడ ముచ్చటగా ఆకట్టుకుంటుంది... ఇక ఈ వైరల్ వీడియో చూసి నెటిజనులు.. ఆ కోతులను చూసి మనుషులు ఎంతో నేర్చుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియోను చూసేయండి మరి.ఇక ఇలాంటి మరెన్నో వైరల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో వైరల్ న్యూస్ ల గురించి తెలుసుకోండి...