మందుబాబులకు త్వరలో శుభవార్త..! ఆ బ్రాండ్ పై రేటు తగ్గపోతుందట..?

Divya

 మద్యపానం ఆరోగ్యానికి హానికరం అంటూనే  కేంద్ర ప్రభుత్వాలు మద్యాన్ని అమ్ముతున్నాయి . ఇక అదే నేపథ్యంలోనే  వివిధ దేశాల నుండి మద్యాన్ని దిగుమతి చేసుకుంటున్నాయి .  అందులో భాగంగానే మద్యపాన ప్రియులు త్వరలో శుభవార్త విన బోతున్నారని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది.  యూరప్ నుంచి దిగుమతి చేసుకున్న వైన్స్ పై  బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని తగ్గించాలని భావిస్తోందట. విదేశీ బ్రాండ్లు ప్రస్తుతం ఉన్న ధర కంటే తక్కువ ధరకే లభించబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం లోని వాణిజ్య పరిశ్రమల శాఖ అధికారులు, సెంట్రల్ ఆహార ఉత్పత్తుల తయారీ, ఆల్కహాలిక్ బెవరేజ్ మాన్యుఫ్యాక్చరర్స్ అధికారులు  ఈ విషయం పై కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో యూరోపియన్ యూనియన్ తో యూరప్, ఇండియా ల మధ్య మంచి వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని నిర్ణయించుకున్నారు.

ప్రస్తుతం విదేశీ ఆల్కహాల్  ఉత్పత్తులపై కేంద్రం 150 శాతం కస్టమ్స్ డ్యూటీ ని విధిస్తోంది. అయితే. ఈయూ- ఇండో వాణిజ్య ఒప్పందం లో భాగంగా కస్టమ్స్ డ్యూటీని 75 శాతానికి పరిమితం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో ఇప్పుడున్న ధరల కంటే చౌక ధరలకే విదేశీ బ్రాండ్లు వస్తాయి. ఇక ఇదేగాని జరిగితే దేశీయ ఆల్కహాలు ఉత్పత్తి సంస్థలకు ఇబ్బందులు తలెత్తుతాయి. ఫలితంగా చౌకగా దొరికే బ్రాండ్ ల వైపే మద్యం ప్రియులు మక్కువ చూపడంతో, దేశీయ ఉత్పత్తులపై మరింత భారం పడే అవకాశం ఉంది.

అయితే  దేశీయ ఉత్పత్తులను కూడా దృష్టిలో పెట్టుకుని,  విదేశీ ఆల్కహాల్ ఉత్పత్తుల సుంకాన్ని తగ్గించడం వల్ల దేశీయ ఉత్పత్తి సంస్థల వ్యాపార విస్తరణకు ఎలాంటి ఇబ్బంది ఉండదని కేంద్రం హామీ ఇవ్వడం గమనార్హం. (Ciabc ) డైరెక్టర్ జనరల్ వినోద్ గిరి మాట్లాడుతూ.. " భారత్ తో పోల్చుకుంటే యూరప్ లో ఆల్కహాల్ ఉత్పత్తి తయారీ కి అయ్యే ఖర్చు 50 శాతం తక్కువగానే ఉందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో కస్టమ్స్ సుంకం పరిమితికి మించి తగ్గిస్తే, దేశీయ సంస్థలు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని తెలిపారు."
సీ ఐ ఏ బీ సీ డేటా ప్రకారం, యూరప్ నుంచి భారత్ కు సంవత్సరానికి రూ.1,850 కోట్ల  వైన్స్ దిగుమతి చేసుకుంటోందట. కేవలం  రూ. 160 కోట్ల వైన్ ను మాత్రమే యూరప్ కు  భారత్ ఎగుమతి చేస్తోంది. విదేశీ ఆల్కహాల్ ఉత్పత్తుల వార్షిక టర్నోవర్ భారత్ లో రూ.4.5. లక్షల కోట్లు కావడం గమనార్హం. ఇందులో రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల ద్వారా సంవత్సరానికి రూ.2.5 లక్షల కోట్ల ఆదాయం సమకూరుతోంది. ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తగ్గిస్తే, మందు ప్రియులు చాలా ఆనంద పడతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: