మన దేశ ఆహారపుటలవాట్లు ఎంత గొప్పవో తెలుసుకోండి..

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... మన దేశ సాంప్రదాయాలు, మన పూర్వికుల ఆహారపుటలవాట్లు కాని చాలా గొప్పవి. ఇక మన పూర్వికులు ఆరోజుల్లో ఎన్నో సంవత్సరాలు ఎలాంటి ఆనారోగ్యాలకు గురవకుండా ఎన్నో ఏళ్ళు బ్రతికారు.. డానికి కారణం వాళ్లు ఆరోజుల్లో పండించే ఆహారం. ఆ రోజుల్లో ఎలాంటి కల్తీ లేని ఆహారం దొరికేది. కాని ఈరోజుల్లో మనం తినే ఆహారం చాలా కల్తీ అనే చెప్పాలి. ఇంకా ఆ రోజుల్లో వ్యాయామం చేసేవాళ్ళు.. అందువల్ల ఎక్కువ కాలం బ్రతికేవారు. కాని ఈరోజుల్లో కల్తీ ఆహారానికి అలవాటు పడి 60 సంవత్సరాలు కూడా ఆరోగ్యంగా బ్రతకలేక చనిపోతున్నారు. కల్తీ ఆహారం వల్ల యవ్వన వయస్సులోనే చాలామంది షుగర్, బీపి లకు గురయ్యి దీర్ఘ కాలం ఎన్నో అవస్థలు పడుతున్నారు..అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. ఇక అందుకే మన దేశ ఆహరపుటలవాట్లను మన వాళ్ళు మర్చిపోతున్నారు...
కాలచక్రం వెనక్కి వెళ్తుంది కాని ముందుకు వెళ్లడం లేదు. ఎందుకంటే మనం ఏ వ్యవస్థలని తిట్టామో చివరికి అవే వ్యవస్థలు దిక్కవుతున్నాయి. ఉప్పుతో ఇంకా బూడిదతో పళ్ళు తోముకోడాన్ని మనం చులకనగా భావించాము. కాని ఇప్పుడు ఆ ఉప్పు బూడిదనే ఇప్పుడు ఆరోగ్యం అంటూ మనం ఇప్పుడు వాటితో తయారు చేసే పేస్టులనే మన దంతాలు శుభ్రం చేసుకోడానికి వాడుతున్నాము. ఇక ఆహారం విషయానికి వస్తే ఈ ప్రపంచంలోనే ఎంతో ఆరోగ్యకరమైన ఆహారం మన దేశంలోనే దొరుకుతుంది.. ఈ మధ్య కాలంలో మనం కరోనా నుంచి త్వరగా కోలుకోవడానికి కారణం మన ఆహారమే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మనం తినే మసాలాలు కానివ్వండి ఇంకా మనం తినే తాలింపు ఆహారం కానివ్వండి కరోనా వైరస్ తగ్గడానికి కీలక పాత్ర వహించాయి.

ఇక మనం చాలా వరకు చద్ది అన్నాన్ని చాలా చులకనగా చూస్తాం. కాని చద్ది అన్నం చాలా మంచిది.. అది తినే మన పెద్దలు చాలా కాలం బ్రతికారు. కాని మనం విదేశీ ఆహారాపుటలవాట్లకి బానిసలయ్యి మన చద్ది అన్నాన్ని పక్కన పెట్టేసాం. కాని కొన్ని దేశాల్లో చద్ది అన్నాన్ని ఫైవ్ స్టార్ హోటల్లో సుమారు 800 రూపాయలకి అమ్ముతున్నారట..ప్రస్తుతం ఈ వార్త  తెగ వైరల్ అవుతుంది. ఇక 
అర్ధం  చేసుకోండి. మన ఆహారం ఎంత ఆరోగ్యమో... కాబట్టి మన దేశ సాంప్రదాయలను, ఆహరపుటలవాట్లను ఒక పుస్తక రూపంలో రాసి భావి తరాలకి తెలియజేయాల్సిన అవసరం వుంది...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: