గుండుతో వున్న తన తన తండ్రిని చూసి ఆ పిల్లలు ఏం చేశారో చూడండి....
సాధారణంగా ఇలాంటి మరిచిపోలేని మెమోరీస్ ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి.జోనాథన్ నార్మోయిల్ అనే టిక్ టాక్ యూజర్ తన కొత్త లుక్ కోసం గుండు గీసుకున్నాడు. క్లీన్ షేవ్ చేసి మీసాలు, గెడ్డం తీసేశాడు. ఆ తర్వాత సోఫాలో కూర్చున్న తన కవల పిల్లల వద్దకు తన రూపాన్ని చూపించాడు. ‘‘హాయ్ ఏం చేస్తున్నారు?’’ అని అడిగాడు. ఆ పిల్లలు తమ తండ్రిని గుర్తుపట్టలేకపోయినా.. గొంతును కనిపెట్టారు. కానీ, అతడు క్లీన్ షేవ్ చేసుకుని అపరిచితుడిలా కనిపించడంతో కాసేపు గందరగోళానికి గురయ్యారు.ఈ సందర్భంగా కవలల్లో ఒక పాప ఏడ్వడం మొదలుపెట్టింది. అయితే, రెండో పాప మాత్రం షాక్‌తో అలా చూస్తూనే ఉండిపోయింది.
మొదటి పాపను ఓదార్చేందుకు తండ్రి చేతులు ముందుకు చాపగా.. తన సోదరిని ముట్టుకోవద్దు అన్నట్లుగా రెండో పాప.. చేయి అడ్డంగా పెట్టింది. అనంతరం ఆమె కూడా ఏడుపు మొదలుపెట్టింది. జోనాథన్ ఈ వీడియోను టిక్‌టాక్‌లో పోస్టు చేశాడు. ఆ పిల్లల ఏడుపు చూసి నెటిజనులు ఫిదా అవుతున్నారు. దీంతో వీడియో కూడా వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు 4.5 మిలియన్ మంది వీక్షించారు.ఇది ఇప్పుడు మంచి ట్రెండింగ్ లో వీక్షించబడుతూ అందరిని తెగ ఆకట్టుకుంటుంది...