కరోనా దండయాత్ర.. మళ్ళీ స్కూల్స్, కాలేజీలకు కష్టమే...!!

Purushottham Vinay
కరోనా ఇప్పుడు కూడా విలయ తాండవం చేస్తుంది. ఇంకా దీని ప్రభావం తగ్గలేదు. మళ్ళీ రోజు రోజుకి కేసులు చాప కింద నీరు లాగా ప్రపంచమంతా వ్యాపిస్తూ చాలా ఎక్కువవుతున్నాయి. ఇక మనదేశంలో కూడా రోజు రోజుకి చాలా ఎక్కువవుతున్నాయి.స్కూల్స్, కాలేజీలు అన్ని మూత పడబోతున్నాయా అన్నటువంటి అనుమానం మళ్ళీ కలుగుతుంది. ఇక కరోనా వైరస్ రెండవ దండ యాత్ర ఆరాచకం ప్రారంభం అయినటువంటి దశ మళ్ళీ మొదలైంది. అందులో శర వేగంగా 10 శాతం మందికి మాత్రమే కరోనా లక్షణాలు కనబడుతున్నాయని సమాచారం అందుతుంది. మిగతా 90 శాతం మాత్రం ఈ కరోనా లక్షణాలు ఏమాత్రం కనబడకుండా వ్యాపిస్తుందని సమాచారం అందుతుంది. ఇక సినిమా థియేటర్ల సంఖ్యని కూడా తగ్గించాలని సమాచారం అందుతుంది. లేటెస్ట్ గా కరోనా కేసులు బాగా పెరుగుతున్న నేపథ్యంలో తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది.



ఇక ఆ కీలక నిర్ణయం ఏమిటంటే ఈ నెల 22 వ తేదీ నుంచి 9,10,11 వ తరగతులు అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ తరగతులకి తిరిగి తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఆన్లైన్ లోనే విద్యా విధానాలు చేయాలి అన్నటువంటిది తాజాగా అందుతున్న సమాచారం.ఇక మిగతా తరగతుల పరీక్షలు ఏమవుతాయి అనే విషయానికి వస్తే.. ఇక కిందట సంవత్సరం పరీక్షలు పెట్టకుండా విద్యార్థులను పాస్ చేసి పై తరగతులకి ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక కొన్ని తరగతులకి అయితే తరువాత విడి విడిగా జాగ్రత్తలు తీసుకొని నిర్వహించడం కొనసాగింది. ఇక ఇప్పుడు కరోనా కేసులు ఎక్కువైనా నేపథ్యంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఎలా కొనసాగిస్తారో వేచి చూడాల్సిందే.ఇక నైనా ఈ కరోనా వైరస్ ప్రభావం తగ్గుతుందో లేదో చూడాలి...ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోడానికి ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: