డాన్స్ తో అతను కూరగాయలు అమ్మే స్టైల్ చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే....
ఇక ఈ వ్యాపారిని చూసినట్లయితే రోడ్డు మీద కాయగూరలు అమ్మే ఇతడికి కూడా ఓ ప్రత్యేకత ఉంది. ఇతడు చిందేస్తూ చిక్కెడు కాయలు.. డ్యాన్స్ చేస్తూ దొండ కాయలు.. పాటలతో పాలకూర.. అమ్మేస్తాడు. అందుకే అతడిని అంతా ‘చుల్బుల్ పాండే’ అంటారు. ఇది దబాంగ్ సినిమాలో పాత్ర. తలకు టవల్ కట్టుకుని.. సన్ గ్లాసెస్ పెట్టుకుని.. ‘ఆజావ్ భాయ్ సబ్జీ లేలో’ అనే ప్రత్యేకమైన పాటకు చిందులేస్తూ కూరగాయలను విక్రయించడం ఇతడి స్టైల్.హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఎలాంటి టెన్సన్స్ లేకుండా వ్యాపారం చేసుకుంటాడు. వచ్చిన దాంట్లోనే తృప్తిగా బ్రతుకుతాడు.జార్ఖండ్‌లోని దన్బాద్లో నివసిస్తున్న ఈ కూరగాయల వ్యాపారి పేరు రితేష్ పాండే. ఇతడు డ్యాన్స్ చేస్తూ కూరగాయలు అమ్ముతున్న వీడియో ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఇప్పుడు నెటిజనులంతా రితేష్‌కు అభిమానులైపోయారు. పెట్రోల్ బంక్‌లో పనిచేస్తు్న్న ఓ యువతి ఈ వీడియో తీసింది. అదే ఇప్పుడు అతడిని ఫేమస్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు చూసి లైక్ కొట్టి షేర్ చెయ్యండి.