యూపీలో వింత ఆచారం..హోలీ పండగలో మగవారిని చితకబాదుతున్న మహిళలు..!

MADDIBOINA AJAY KUMAR
భారత్ విభిన్న సంస్కృతుల సమ్మేళనం. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన వేషధారణ కనిపిస్తుంది. అన్ని ప్రాంతాల్లో ఒకే పండగను జరుపుకున్నా భిన్న రీతుల్లో జరుపుకుంటారు. అయితే కొన్ని సార్లు ఆచారాలు కట్టుబాట్లు  విచిత్రంగా ఉంటాయి. అలా విచిత్రంగా జ‌రుపుకుంటున్న ఓ పండ‌గ గురించి ఇప్పుడు చూద్దాం. దేశంలో అన్ని రాష్ట్రాల్లో రంగుల పండ‌గ హోళీని జ‌రుపుకుంటారు. హోళీ పండ‌గ‌ను కుంటుంబ స‌భ్యులు..స్నేహితుల‌తో క‌లిసి ఎంతోఆనందంగా జ‌రుకుంటారు. ఇక గ‌తేడాది క‌రోనా కార‌ణంగా ఎన్నో పండ‌గ‌ల‌కు దూరంగా ఉన్న ప్ర‌జ‌లు హోళీ పండ‌గ‌ను సైతం జ‌రుపుకోలేదు. అయితే ఈ ఏడాది మాత్రం హోళీ సంబురాలు కొన్ని ప్రాంతాల్లో అప్పుడే మొద‌ల‌య్యాయి. ఈ నేప‌థ్యంలోనే ఉత్త‌రప్ర‌దేశ్ లోని మ‌థుర లో కూడా హోళీ సంబురాలు మొద‌ల‌య్యాయి. అయితే మ‌థుర జిల్లాలోని బ‌న్సారా లోని ప్ర‌జ‌లు హోళీ పండుగకు ముందు ల‌త్మ‌ర్ హోళీ ని జ‌రుపుకుంటారు. అయితే వారి ఆచారాలు మాత్రం ఇత‌రులకు భిన్నంగా ఉంటాయి. వాళ్లు కూడా మొద‌ట రంగులు చ‌ల్లుకుంటూ ఎంజాయ్ చేస్తారు.
కానీ ఆత‌ర‌వాత ఆడ‌వాళ్లంతా క‌లిసి మ‌గ‌వాళ్ల‌ను కొడ‌తారు. అయితే మ‌గ‌వాళ్ల త‌మ‌కు దెబ్బ‌లు త‌గ‌ల‌కుండా ప‌ల్లెం లాంటి వ‌స్తువుల‌ను అడ్డం పెట్టుకుంటారు. మ‌గ‌వాళ్లను ఆడ‌వాళ్లు కొట్ట‌డం ఏదో స‌ర‌దాకోసం కాదు.. అలా చేస్తే చెడు అంత‌రించి అంద‌రికీ మంచి జ‌రుగుతుంద‌ట‌. ఏళ్ల త‌ర‌బ‌డి అక్క‌డి ప్ర‌జ‌లు ఈ ఆచారాన్ని కొన‌సాగిస్తున్నార‌ట‌. ప్ర‌స్తుతం ల‌త్క‌ర్ హోళీకి సంభందించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇక ఈ వీడియోలో మ‌హిళ‌లు క‌ర్ర‌ల‌తో బాదుతుంటే పురుషులు త‌మ‌కు దెబ్బ‌లు త‌గ‌ల‌కుండా అడ్డు పెట్టుకుంటున్నారు. ఈ వీడియోపై నెటిజ‌న్లు కూడా కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. మ‌హిళ‌కు ఇదే మంచి ఛాన్స్ కుమ్యేయండి  అంటూ ఓ నారీమ‌ణి కామెంట్ పెట్టింది. మ‌రో నెటిజ‌న్ క‌రోనా టైం లో ఈ ఆటలు అవ‌స‌రమా..కీడు పోవ‌డం ఏమేగానీ క‌రోనా వ‌చ్చి పోతారు అంటూ కామెంట్ పెట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: