
హోళీకి మగవాళ్ళు ఆడవాళ్లవుతారు..ఎక్కడంటే..!
కనిపించిన వ్యక్తులు గతంలో ఏవైనా చెడు పనులు చేస్తే వాటిని గుర్తు చేస్తూ మరీ తిట్లపురాణం మొదలు పెడతారు. అయితే పండగపూట వారు తిట్టే తిట్లకు ఎవరూ కోప్పడరు..వారి తిట్లను ఆశీర్వాదంగా భావిస్తూ ఇంకా కొద్దిసేపు తిడితే భాగుంటుందని అనుకుంటారు. ఇక బయటకు వారికి ఇది పిచ్చిలా అనిపించవచ్చు గానీ స్థానికులకు మాత్రం అది గత వందసంవత్సరాలుగా వస్తోన్న ఆచారం. ఫాల్గుణ మాసం శుద్ద దశమి సందర్భంగా నిర్వహించే ఈ వేడుకలు ఆదివారం నుంచి రెండు రోజుల పాటు కొనసాగుతాయి. అంతకు ముందు రెండు రోజుల క్రితం ఉత్సవ నిర్వాహకులు ఇంటింటికీ వెళ్లి రంగులు చల్లి వేడుక జరుపుకుంటారు.ఇక ఆది సోమవారాల్లో గ్రామం నడిఒడ్డున రతి , మన్మథుల విగ్రహాలకు పూజలు నిర్వహిస్తారు. మరోవైపు ఊరేంగింపు ఉత్సవాల్లొ దవడలకు దబ్బనాలు గుచ్చుకుంటారు. ఇక ఈ ఆచారాలు పాటించడం వల్ల కుటుంబాల్లో మంచి జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు.