అడవికి మహారాజు సింహం. సింహాన్ని చూస్తేనే రొమాలు నిక్కబోడుచుకుంటాయి. దాని రూపం చూస్తేనే గంభీరంగా ఉంటుంది. ఇక భయంకరంగా ఉంటుంది.. ఇక సింహం వేటలో మేటి అనే సంగతి తెలిసిందే. అలాగే దానికి ఆకలి కూడా ఎక్కువే.దాని కంట ఏదైనా జంతువు కాని పడిందా ఇక ఆ జంతువు ఆయుషు తీరిపోయినట్టే. అందుకే సింహం అంటే ఎవ్వరైనా భయపడతారు.అయితే అన్ని సింహాలు క్రూర మృగాలు అయితే కావు. కొన్ని సింహాలు చాలా ప్రేమగా కూడా ఉంటాయి.ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతున్న వీడియోలో సింహం నీటిలో ఈదుతున్న బాతు తలను ప్రేమగా నిమరడం కనిపించింది. ఇక ఈ వీడియో నెట్టింట పలువురిని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ఈ వీడియోను ట్వీట్ చేసిన ఐఎఫ్ఎస్ అధికారి
సుశాంత్ నందా.. మాత్రం అది ప్రేమతోనే దాన్ని తాకిందని అభిప్రాయ పడుతూ తెలిపారు.‘‘ఇంత పెద్ద మాంసాహారులకు సున్నితమైన హృదయం ఉంటుందని మీలో ఎంతమంది అనుకున్నారు? అవి వన్య ప్రాణులే. కానీ, క్రూరమైనవి కావు. వాటిని గౌరవించండి, ఆరాధించండి. వాటి మనుగడ కోసం లేదా ఎవరైనా రెచ్చగొట్టినప్పుడు మాత్రమే అవి చంపుతాయి’’ అని క్యాప్షన్‌లో వెల్లడించారు.
ఈ వీడియోలో చూస్తుంటే.. నీటిలో ఉన్న బాతును సింహం తన కాళ్లతో ఒడ్డుపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ సందర్భంగా అది
కుక్క పిల్లను ప్రేమతో దువ్వుతున్నట్లుగా బాతు తలను నిమిరింది. కానీ, బాతు మాత్రం ఆ సింహం చేష్టలకు బెదిరిపోయింది. మరి, ఆ సింహం ఉద్దేశం ఏదైనా.. దీనిపై సోషల్
మీడియా లో భిన్నమైన చర్చ నడుస్తోంది. అది ప్రేమతో ఆరాదించడం లేదని,
నీటి నుంచి బయటకు వస్తే తినేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోందని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఇక మీరు కూడా ఈ వీడియో చూసి మీ అభిప్రాయం కూడా చెప్పేయండి. ఇక ఇలాంటి మరెన్నో వైరల్ న్యూస్ ల కోసం
ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన వైరల్ న్యూస్ ల గురించి తెలుసుకోండి...