ఇళయరాజాకు క్రైస్తవుల సెగ...తట్టుకుంటాడా...?
ప్రముఖ సంగీత దర్శకుడు అయిన ఇళయరాజా గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. ఈయన సంగీతాన్ని అందించిన ప్రతీ పాట ఒక ఆణిముత్యం. అయితే ఈయన ఒక వివాదంలో చిక్కుకున్నారు. ఈయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు చనిపోయిన తరువాత తిరిగి వచ్చినది ఒక్క శ్రీ భగవాన్ రమణ మహర్షి మాత్రమే అని బహిరంగంగా చెప్పారు. అంతే కాకుండా వేరెవరికీ కూడా ఇది సాధ్యపడలేదని అన్నారు. ఇది ఇప్పుడు తమిళనాడు లో నివసిస్తున్న క్రెస్తవులకు ఇది తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. దీనితో ఇళయరాజాకు వ్యతిరేకంగా వారంతా ఇప్పుడు నిరసనలకు దిగారు. వీరు ఇంత ఆగ్రహానికి గురవ్వడానికి కారణం ఏమిటంటే..? క్రైస్తవులు నమ్ముతున్న ప్రకారం క్రీస్తు సిలువ వేయబడిన తరువాత..మళ్ళీ తిరిగి సజీవుడై ఈ లోకానికి తిరిగి వస్తాడు. ఈయన జనంతో మమేకమై వారిని తన మహిమలతో స్వస్థపరుస్తూ లోకనాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. అటువంటి యేసు ఉండగా...ఈ ప్రపంచంలో రమణ మహర్షి తప్ప మరొకరు చనిపోయిన తరువాత బ్రతకలేదని అనడం వారు జీర్ణించుకోలేక పోయారు.
ఇళయరాజా అన్న మాటలను వెనక్కు తీసుకోవాలని అలాగే క్షమాపణలు చెప్పాలని నిరసనలను చేపట్టారు. ఇది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల సమయం. ఒకవేళ ఇళయరాజా కనుక రాజకీయ నాయకుడు అయి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ నిరసనలు మరింత ఎక్కువవుతున్న తరుణంలో ఇళయరాజా ఎలా స్పందిస్తాడో తెలియాల్సి ఉంది. కాగా ఇళయరాజా అభిమానులు చెబుతున్న ప్రకారం "ఆయన దేవుళ్ళ గురించి ఇక్కడ ప్రస్తావించలేదు, ముఖ్యంగా యేసు క్రీస్తు గురించి కూడా ఏమీ అనలేదు, కేవలం ఆయన నమ్మే రమణ మహర్షి గురించి మాత్రమే తన అభిప్రాయం చెప్పారు.