వైరల్ : రిపోర్టర్ చేతిలో మైకు లాక్కెల్లిన కుక్క.. ఆకట్టుకుంటున్న వీడియో.....

Purushottham Vinay
టీవీ రిపోర్టర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏదైనా న్యూస్ దొరికిందంటే చాలు నాన్ స్టాప్ గా గడ గడ మాట్లాడేస్తుంటారు. ఇక మాస్కోలో ఓ ఫన్నీ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. మాస్కోకి చెందిన ఓ టీవీ రిపోర్టర్‌కు ఊహించని చేదు అనుభవం ఎదురైంది. టీవీ చానెల్‌కు లైవ్‌లో సమాచారం ఇస్తున్న సమయంలో ఓ కుక్క పరుగున వచ్చి ఆమె చేతిలోని మైకును ఎత్తుకెళ్లిపోయింది. ఈ ఘటన రష్యాలోని మాస్కోలో చోటుచేసుకుంది. నడేజ్డా సెరెజ్కినా అనే రిపోర్టర్ లైవ్‌లో వాతావరణ వివరాలు చెబుతున్న సమయంలో గోల్డెన్ రిట్రీవర్ కుక్క అక్కడికి వచ్చింది. ఆమె చేతిలో ఉన్న మైకు ఆకర్షణీయంగా కనిపించడంతో దాన్ని తినే వస్తువు అనుకుందో ఏమో.. ఒక్క ఉదుటున పైకి ఎగిరింది. ఆ వెంటనే ఆమె చేతిలోని మైకును నోటితో పట్టుకుని అక్కడి నుంచి పరుగు పెట్టింది.ఈ ఆకస్మిక ఘటనకి రిపోర్టర్‌తోపాటు లైవ్‌లో ఉన్న న్యూస్ యాంకర్ సైతం షాకైంది. రిపోర్ట్ వెంటనే కుక్క నోట్లో ఉన్న మైకు పట్టుకోడానికి పరుగులు పెట్టింది.


ఇదంతా కెమేరాలో రికార్డు కావడంతోపాటు లైవ్‌లో ప్రసారమైంది. ఈ వీడియోను అలీ ఓజ్కాక్ అనే జర్నలిస్ట్ ట్వీట్ చేయడంతో క్షణాల్లో వైరల్‌గా మారింది. సుమారు 3 మిలియన్ మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. ఈ వీడియో చూసి నెటిజనులు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. రష్యాలో కుక్కలే ఇంటర్వ్యూ చేస్తాయి కాబోలు అని అంటున్నారు. అక్కడ అంత ఫన్నీ ఘటన చోటుచేసుకున్నా.. న్యూస్ యాంకర్ నవ్వకుండా ఎలా ఉండగలిగిందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం ఈ వీడియో అయితే నెట్టింటా తెగ వైరల్ అవుతుంది. మీరు చూసి నవ్వుకోండి. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వైరల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో వైరల్ విషయాలు గురించి తెలుసుకోండి...






మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: