జింకలు అలా ఎందుకు చేశాయో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Satvika
జింకలు అన్నీ కూర మృగాలకు టార్గెట్ గా మారతాయి. వాటిని వేటాడి చంపి తింటాయి. అయితే ఒంటరిగా జింకలను వేటాడుతాయి. కానీ, గుంపులుగా ఉన్న వాటిని వేటాడటానికి ఏ పెద్ద జంతువైన కూడా వెనకడుగు వేయాల్సిందే.. ఇది ఇలా ఉండగా.. జింకలు సుడిగుండం గురించి ఎప్పుడైనా విన్నారా? ఇది నిజమే సముద్రంలో ఏ విధంగా సుడిగుండాలు వాస్తాయో.. అదే విధంగా జింకలు కూడా ప్రవర్తిస్తాయి..గాలి సుడులు తిరిగినట్టుగా జింకలూ వేగంగా తిరుగుతాయి. ఎలా ఎందుకు తిరుగుతాయి అనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


వివరాల్లోకి వెళితే.. ఉత్తర రష్యాలోని కోలా పెన్సులలో ఓ ఫోటోగ్రాఫర్ కు చిక్కిన ఓ వీడియో దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఏకంగా వందల సంఖ్యలో జింకలు గుండ్రంగా తిరుగుతూ కనిపించాయి. సాధారణంగా ఉత్తర ప్రాంతంలో ఉండే జింకలు తమను తాము రక్షించుకోవడానికి తమ దగ్గరకు వస్తున్న శత్రువును కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా చేస్తుంటాయట.


చిన్న పిల్లలను రక్షించు కోవడం కోసమే ఇలా వలయాకారంగా వేగంగా తిరుగుతాయట. మధ్య లో పిల్లలను ఉంచి వాటి చుట్టూ పెద్ద జింకలు గిర్రున తిరుగుతూ ఉంటాయి. అన్నిటిలోకి బలమైనవి బయట వరుసలో ఉంటాయి. జింకల మీద దాడిచేసే వేటకుక్కలు, తోడేళ్ళు, పులులు వంటి జంతువులు మంద నుండి ఒక్కో జింకను విడదీయడానికి ప్రయత్నిస్తాయి. మంద నుంచి విడిపోయిన జింకను చుట్టి ముట్టి చంపి తింటాయి. అలా విడివిడిగా కాకుండా ఉండేందుకు.. పిల్లలు వెనుకబడిపోయి జంతువుల చేతిలో చిక్కకుండా ఉండేందుకు ఆ ప్రాంతం లో జింకలు ఇలా చేస్తాయట.. అసలు ఎందుకు అలా తిరిగాయంటే.. ఒక వెటర్నరీ డాక్టర్ ఆ జింక పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వడానికి వెళ్లారట.. అతనికి చిక్కకుండా అలా తిరిగాయట.. ఇందుకు సంబంధించిన ఫోటోలు,వీడియోలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: