వైరల్ :తన ప్రియురాలి నగ్న ఫోటోలను, వీడియోలను ఆ ప్రియుడు ఏం చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.....
ప్రేమపేరుతో ప్రియురాలు నగ్న ఫోటోలు, వీడియోలు సంపాధించిన రాజేంద్రసింగ్ వాటిని స్నేహితులకు, ఫ్రెండ్ వాట్సాప్ గ్రూపులు, కొంతమందికి మెయిల్ ద్వారా వాటిని షేర్ చేశాడు. అంతటితో వదలని రాజేంద్రసింగ్ ప్రియురాలి నగ్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విడుదల చెయ్యడంతో అవికాస్తా వైరల్ అయ్యాయి.ఆ యువతికి తెలిసిన ఆమె సన్నిహితులు యువతి నగ్న ఫోటోలు సోషల్ మీడియాలో చూసి ఆమెకు సమాచారం ఇచ్చారు. తన నగ్న ఫోటోలు సోషల్ మీడియాలో చూసి షాక్ అయిన ఆ అమ్మాయి విజయపుర పోలీసులను ఆశ్రయించింది. విషయం తెలుసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు.
లక్నోకి వెళ్లిన కర్ణాటక పోలీసులు అక్కడ తలదాచుకున్న రాజేంద్రసింగ్ ను పట్టుకున్నారు.లక్నో నుంచి రాజేంద్రసింగ్ ను కర్ణాటకలోని విజయపురకు పిలుచుకుని వచ్చి అతని నరాలు నిలువుగా పిండేసి కోర్టు ముందు హాజరుపరిచారు. నాన్ బెయిలబుల్ కేసులు నమోదు కావడంతో రాజేంద్రసింగ్ జైల్లో ఉన్నాడు.చూశారుగా సోషల్ మీడియాలో గుడ్డిగా ఇలాంటి పోరంబోకు మోసగాళ్ళను నమ్మి ఇలాంటి పరువు పోయే పరిస్థితులు ఎదురుకుంటున్నారు. ఇలాంటి విషయాలలో అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు మనవి చేస్తున్నారు.