టాయిలెట్ లో కాలక్షేపం చేసినందుకు ఉద్యోగికి కంపెనీ ఏం చేసిందో తెలుసా?

Purushottham Vinay
కొంతమంది ఉద్యోగులు వుంటారు తాము పని చేసే కంపెనీలో ఎక్కువ సమయం టాయిలెట్ లలో గడుపుతూ వుంటారు. దాదాపు గంటలు గంటలు అక్కడే గడుపుతూ వుంటారు. పని ఒత్తిడి వల్లనో లేక సిగిరెట్ స్మోకింగ్ కోసమో కొంతమంది టాయిలెట్ లలో ఎక్కువ సమయం గడపడం సహజం. అలాగే ఓ ఉద్యోగి కూడా ఆఫీసు వేళల్లో తన డెస్కులో కంటే టాయిలెట్‌లోనే ఎక్కువ సేపు టైంపాస్ చేస్తున్నాడనే కారణంతో.. అతడు పనిచేస్తున్న కంపెనీ అతడు టాయిలెట్‌లో కూర్చొని వృథా చేసి పని గంటలను లెక్కించి.. అతడి జీతంలో కోత విధించింది. దీంతో షాక్ తిన్న ఆ ఉద్యోగి ఇది అన్యాయమంటూ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించాడు. ఈ ఘటన తైవాన్‌లో చోటుచేసుకుంది.టాయిలెట్‌లో ఎక్కువ సేపు కూర్చొనే అలవాటు.. తనకు ఈ విధంగా షాకిస్తుందని తెలియదని ఊహించలేదని బాధితుడు వాపోయాడు. ‘మిస్టర్ ఎ’ పేరుతో తన ఫ్రస్టేషన్‌ను ఫేస్‌బుక్ ద్వారా బయటపెట్టాడు. ఇతడు నెలకు 49.5 గంటలు టాయిలెట్‌లోనే గడిపేవాడని, అంటే రోజూ పని వేళల్లో రెండు గంటలు టాయిలెట్‌లోనే వేస్ట్ చేసేవాడని కంపెనీ ఆరోపణ చేస్తుంది. అందుకే, తాము జీతాన్ని కట్ చేశామని తెలిపింది. అతడు ఎంత సేపు టాయిలెట్‌లో గడిపాడనేది తమ సీసీటీవీ కెమేరాలో రికార్డైందని తెలిపింది. అయితే, యాజమాన్యం ముందుగా తనకు ఈ విషయాన్ని తెలపలేదని, ఇది చాలా అన్యాయమని అతడు తెలిపాడు. అంతేగాక వేస్ట్ చేసిన గంటలకు కట్ చేయాల్సిన మొత్తం కంటే అదనంగా జీతంలో కోత విధించారని తెలిపాడు.ఈ వివరాలను ఫేస్‌బుక్‌లోని Blame 2 Commune అనే గ్రూపులో పోస్ట్ చేశాడు. ఇప్పుడు తాను ఏం చేయాలో సలహా ఇవ్వాలని అందులోని సభ్యులను కోరాడు.


గత నెల తాను 22 రోజుల్లో మొత్తం 195 గంటలు పనిచేశానని తెలిపాడు. ప్రతి గంటకు సంస్థ 160 యువాన్ (రూ.1826) చొప్పున చెల్లిస్తోందని, తన నెల జీతంలో 4,400 యువాన్ (రూ.50,198) కట్ చేసిందని వివరించాడు. ఇలా చేయడం చాలా అన్యాయమని పేర్కొన్నాడు. మేనేజ్మెంట్ రోజులో ఒక గంట మాత్రమే టాయిలెట్‌కు సమయం ఇస్తుందని, కాబట్టి తాను 27.5 గంటలు మాత్రమే టాయిలెట్లో ఉన్నట్లు లెక్క అని తెలిపాడు.‘‘ఒకే, నేను టాయిలెట్‌లో అంత సేపు ఉండటం తప్పే. కానీ, అన్యాయంగా నా జీతాన్ని కట్ చేయడం న్యాయమేనా? ఈ విషయాన్ని ప్రశ్నిస్తే.. ఉద్యోగం నుంచి తొలగిస్తామని చెప్పారు. దీనిపై లేబర్ బ్యూరోకు పిర్యాదు చేస్తా.


నేను ఒక వేళ టాయిలెట్‌కు వెళ్లి ఉండకపోతే.. నా పాంట్‌లోనే విసర్జన చేసేవాడిని, ఆఫీసు మొత్తం కంపు చేసేవాడిని’’ అని తెలిపాడు. అయితే, సోషల్ మీడియాలో దీనిపై కొంతమంది అతనికి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు.‘‘రోజుకు రెండు గంటలు టాయిలెట్‌లో ఏం పని నీకు?’’ అని కొందరు నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ‘‘నువ్వు టాయిలెట్లో గడిపిన గంటలన్నీ కలిపితే.. దాదాపు రెండు రోజులు. అంటే నువ్వు నెలలో రెండు రోజులు ఆఫీసులో కంటే టాయిలెట్‌లోనే ఎక్కువ సేపు కూర్చుంటున్నావు’’ అని కామెంట్లు చేస్తున్నారు. ‘‘కంపెనీ నిన్ను ఆఫీసులో బుద్ధిగా కూర్చొని పనిచేయమని ఉద్యోగం ఇచ్చింది. అంతేగానీ.. రోజుకు రెండు గంటలు టాయిలెట్‌లో కూర్చోమని కాదు.కొంచమైనా బాధ్యత ఉండనక్కర్లేదా ’’ అని అతడిని తప్పుబడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: