వైరల్ : సముద్రంలో కూలిన విమానం వైరల్ అవుతున్న వీడియో....
ఇక అక్కడ విమానం గాల్లో రయ్యి మంటూ తిరుగుతూ పెర్ఫార్మన్స్ ఇస్తున్న టైంలో ఒక్కసారే సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పైలట్ దాన్ని కిందికి దింపాల్సి వచ్చింది. తిరిగి ఎయిర్‌పోర్టులో వెళ్లడం కష్టమని భావించి విమానాన్ని సముద్రంలోనే దింపేయాలని నిర్ణయించాడు. దీంతో సముద్ర తీరానికి చాలా దగ్గరగా తక్కువ ఎత్తులో విమానాన్ని నడిపాడు. ఆ సమయంలో బీచ్‌లో పర్యాటకులు స్నానాలు చేస్తున్నారు. అయితే, పైలెట్ చాకచక్యంగా విమానాన్ని సముద్రంలోనే దింపేశాడు. దీంతో జనాలు ఒక్కసారిగా షాక్ కి గురవ్వడం జరిగింది.
అయితే ఇక్కడ ఆశ్చర్య పడాల్సిన ఇంకా మెచ్చుకోవాల్సిన విషయం ఏమిటంటే..పైలెట్ కి ఏమి కాలేదు.ప్రమాదంలో పైలెట్‌కు ఏమైనా జరిగిందేమోనని భయపడ్డారు. అయితే, అతడు వెంటనే బయటకు వచ్చి తనకు ఏం కాలేదంటూ చేతులు ఊపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పైలెట్ అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో ఈ వీడియో చూసిన నెటిజనులు పైలెట్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.