వామ్మో..ఇలా చేస్తే జాయింట్లు జారడం పక్కా..వీడియో..

Satvika
యోగా చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే.. శరీరాకృతి కావాలంటే ఇలా తప్పక చేయాలి. మెడిటేషన్‌ చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని ప్రస్తుత కరోనా కాలంలో ఎందరో సెలవిస్తున్నారు. అయితే, యోగ చేయడం అనేది గురువు లేకుండా సాధ్యపడదు. ఒక పద్ధతి ప్రకారం యోగాసాధన చేయడం ద్వారా శరీరాన్ని అదుపులో ఉంచుకోవచ్చని కొందరు చెప్పు కొచ్చారు. ఏకాగ్రత తో చేస్తే కానీ అలాంటి బెండింగ్స్ చేయలేరు. అలాంటిది ఓ యువకుడు ఎటువంటి శిక్షణ లేకుండా అదిరిపోయే స్టంట్లు చేశాడు. 

అతను అబ్బుర పరిచే విన్యాసాలను చేసి అందరికీ షాక్ ఇచ్చాడు.. ఎంత సునాయాసం గా అతను చేసిన ఆసనాలు చూపరులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.. వివరాల్లోకి వెళితే.. ఆఫ్రికా లోని ఓ యువకుడి కి ఇలాంటి శిక్షణలేవీ లేకుండానే శరీరాన్ని 360 డిగ్రీల్లో శరీరాన్ని వంచేస్తూ అందరి చేత ప్రశంశలు అందుకున్నారు. యువకుడు చేసే స్టంట్స్ వీడియో సోషల్ మీడియా లో వైరల్‌గా మారింది. 


ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ ఈ వీడియోను సోషల్ మీడియా లో పంచుకున్నారు. ఇంతవరకు మనం చేయని, చూడని ప్రమాదకరమైన స్టంట్లు చేస్తూ ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. ఈ వీడియో షేర్ చేసిన ఐపీఎస్ ఆఫీసర్ రూపిన్ శర్మ ఆశ్చర్యపోయారు.. అంతేకాదు బాబా రామ్ దేవ్ ను మరిపిస్తున్నాడని అందరూ అభినందించారు. దీంతో ఆ అధికారి అతన్ని ఆఫ్రికా రామ్ దేవ్ బాబా అని పేరు కూడా పెట్టారు. ఒకటిన్నర నిమిషాల నిడివి గల ఈ వీడియోలో ఆ యువకుడు చేసే పలు స్టంట్లు చూడవచ్చు. పోస్ట్ చేసిన ఒక్క రోజు లోనే వేలాది మంది చూడగా, ఎందరో కామెంట్లు పెడుతున్నారు.. లైక్ లు, షేర్ లతో దూసుకుపోతుంది.. మీరు ఒకసారి చూడండి.. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: