బ్యాంక్ బ్రాంచులు 2 వేలకు పైగా క్లోజ్ ?

Divya

బ్యాంకులు అనేవి డబ్బులు దాచుకోవడానికి ఒక లాకర్ లాంటివి. మనము డబ్బులు దాచుకోవాలన్నా లేదా  తీసుకోవాలన్నా, ప్రతి ఒక్కరు బ్యాంకు కు వెళ్లాల్సిందే. కానీ ప్రస్తుత కాలంలో అందరికీ ఏటీఎంలు అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలామంది బ్యాంకులకు వెళ్లడం తగ్గించారు. ఇప్పుడ మరింత పెరిగిపోవడంతో చేతివేళ్ళ లోనే డబ్బు మార్పిడి జరుగుతుంది. ఇక మొబైల్ ఫోన్ లోనే గూగుల్ పే, ఫోన్ పే,పేటీఎం(GOOGULPAY,PHONEPAY,PAYTM,)  వంటివి రావడం వలన కొంతమేరకు బ్యాంకులో రద్దీతగ్గిందని చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో కేంద్ర బ్యాంక్ అయిన bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( RBI) ఒక సంచలన నిర్ణయాన్ని  ప్రకటించింది. సమాచార హక్కు చట్టం RTI కింద ఒక కీలక అంశాన్ని వెల్లడించింది.
2020-2021 ఆర్థిక సంవత్సరంలో పది ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన 2118 బ్రాంచీలు క్లోజ్ అయినట్లు తెలిపింది. అయితే ఈ బ్యాంకు బ్రాంచీలు మొత్తంగా క్లోజ్ కావచ్చు. లేదంటే వేరే బ్యాంకుల బ్రాంచులలోకి విలీనం కావచ్చు. అయితే ఇప్పటికీ ఈ  అంశంపై స్పష్టత లేదు. అయితే ఇలా బ్యాంకులు విలీనం కారణంగా ఈ స్థాయిలో బ్యాంకు బ్రాంచ్ లు క్లోజ్ అవ్వడం గమనార్హం. ఈ 2118 బ్రాంచ్ లలో ఏ బాంక్ లో ఎక్కువ బ్రాంచ్ లు  ఉన్నాయో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.

బ్యాంక్ ఆఫ్ బరోడా కు చెంది 1283 బ్రాంచ్ లు ఉన్నాయి. అతిపెద్ద బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)  332 బ్రాంచ్ లను కలిగి ఉన్నాయి. అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) 169 బ్రాంచ్ లు కలిగి ఉన్నాయి. అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో 124 బ్రాంచ్ లు ఉన్నాయి. కెనరా బ్యాంక్ 107, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 53, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 43, ఇండియన్ బ్యాంక్ 5 బ్రాంచ్ లను కలిగి ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో 10  ప్రభుత్వ బ్యాంకుల విలీనం చేసిన విషయం తెలిసిందే. మొత్తం ఈ పది బ్యాంకులను కలిపి 4 బ్యాంకులుగా ఆవిర్భవించాయి. దీంతో మొత్తం ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 12కు దిగి వచ్చింది. బ్యాంకులు విలీనం వల్ల బ్రాంచ్ లు తగ్గడం, బ్యాంకింగ్ వ్యవస్థకు మంచిది కాదని, నిరుద్యోగులకు ఉపాధి తగ్గుతుందని వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: