టీకా తీసుకుంటే 7.34 కోట్లు సొంతం..
ఇప్పటికే కొన్ని దేశాలు వివిధ బహుమతులు ప్రకటించి ప్రజలను వ్యాక్సిన్ సెంటర్లకు రప్పించుకుంటున్నాయి. తాజాగా ఒహియోలో ఏకంగా లాటరీ పెట్టేశారు. ఈ సందర్భంగా ఒహియో గవర్నర్ మైక్ డివైన్ మాట్లాడుతూ.. టీకా ప్రక్రియను ప్రోత్సహించేందుకు లాటరీలతోపాటు విద్యార్థులకు సైతం ప్రోత్సాహాలను అందిస్తామని తెలిపారు. ఒక మిలియన్ డాలర్ అంటే ప్రస్తుత మన భారత కరెన్సీ ప్రకారం 7.34 కోట్లు లాటరీని సొంతం చేసుకొనే అవకాశాన్ని ప్రజలకు బంపర్ ఆఫర్ గా ప్రకటించడం జరిగింది. ఆ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో జూన్ 2 నుంచి అక్కడ పలు షరుతులతో లాక్‌డౌన్ నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించబోతున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. మన ప్రభుత్వం కూడా ఇలాంటి ఆఫర్ ప్రకటిస్తే చాలా బాగుంటుంది కదూ. మనకు కూడా ఇలాంటి ఆఫర్ ప్రకటించాలని ఆశిద్దాం.