వామ్మో! భారీ కప్ప.. చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
ఇక ఈ భారీ కప్పని కార్నుఫర్ గుప్పీ జాతికి చెందిన కప్పగా దీన్ని గుర్తించారు. ఇది ప్రపంచంలో ఉన్న అతిపెద్ద కప్పల్లో ఒకటి. ఇది సాధారణంగా న్యూ బ్రిటన్ నుంచి సోలమన్ దీవుల బిస్మార్క్ ద్వీప సమూహాల్లో కనిపిస్తుంది.ఈ అసాధారణ భారీ కప్పను చూసిన ప్రజలు నోరెళ్లబెడుతున్నారు. తమ కామెంట్ల రూపంలో సోషల్ మీడియాలో విశేషంగా స్పందిస్తున్నారు. జురాసిక్ పార్క్ సినిమా నుంచి నేరుగా వచ్చిందని కొంతమంది కామెంట్ చేయగా.. ఇది అద్భుతమైన జీవిగా అభివర్ణించారు. ఈ కప్ప గురించి మరింత సమాచారం తెలియజేయాలని ఇంకొందరు తమ పోస్టుల ద్వారా తెలిపారు. ఇది చాలా భయంకరంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇది కప్ప లేక గ్రహంతరవాస అని కామెంట్స్ చేస్తున్నారు.బహుశా సోలమాన్ దీవుల్లో ఉన్న మెలనేషియాలో ఇదే అతిపెద్ద నీటి కప్ప అని పర్యావరణ నిపుణులు అంటున్నారు.