అమెరికా సముద్ర తీరాన వింత పదార్థం.. వైరల్..

Satvika
సముద్రం అంటే ఎన్నో జీవరాశులకు నిలయం.. విశిష్టతలు తెలిపే జంతువుల నుంచి వింతను తలపించే విషపదార్థాలు కూడా దాగి ఉంటాయి. ఇటీవల కాలంలో సముద్ర తీరానికి రకరకాల వింత జంతువులు , వాటి కళేబరాలు కూడా తీరానికి కొట్టుకు వస్తున్నాయి. కొన్ని విషాన్ని నింపుకున్న భయంకర ఆకారాన్ని కలిగి ఉంటే మరి కొన్ని మాత్రం ఆశ్చర్య పరిచేలా అద్భుతాలను కలిగిస్తున్నాయి.. ఇటీవల తిమింగలం వాంతి వచ్చినట్లు వార్తలు వినిపించాయి.. అంతే కాదు దానిని అమ్మితే లక్షలు వచ్చాయని సోషల్ మీడియా లో ఓ వార్త చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే..


ఈ విషయాన్ని పూర్తిగా మరువక ముందే ఇప్పుడు మరో వింత వెలుగులోకి వచ్చింది..ఇలా అమెరికా లో చాలా రకాల జంతు కళేబరాలు, చేపలు లాంటి ఎన్నో సమద్ర తీరానికి కొట్టుకు వస్తున్నాయి.. వాటి గురించి తెలుసుకోవడం శాస్త్రవేత్తలు కూడా తెలుసు కోలేకపోతున్నారు.. ఇది ఇలా ఉండగా .. ఇప్పుడు మరోసారి జనాలను ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తున్న వింత పదార్థం దర్శనమిచ్చింది..అగ్ర రాజ్య మైన అమెరికా సముద్ర తీరాన ఓ వింత పదార్థం చూపరులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వివరాల్లోకి వెళితే..అమెరికాలో వింత పదార్థం దర్శనమిచ్చింది. దీన్ని చూసిన కొందరు స్థానికులు మొదట ఆశ్చర్యపోయారు.


ఆ తర్వాత ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు తెలియజేశారు. ఇక్కడి కేప్ లుకౌట్ నేషనల్ సీషోర్ తీరానికి ఈ వింత పదార్థం కొట్టుకొచ్చింది. అదేంటో ఎవరూ గుర్తుపట్టలేకపోయారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వింత పదార్థాన్ని సోషల్ మీడియాలో పంచుకున్న నేషనల్ పార్క్ సర్వీసు విభాగం ఇదేంటో గుర్తించాలంటూ నెటిజన్లను కోరింది.ఈ సంస్థ మాత్రం దీన్ని స్వ్కిడ్ యొక్క అండపు తిత్తి అని భావిస్తోందట. దీన్ని ఎవరైనా గుర్తుపడతారేమో చూడాలి మరి... ఏది ఏమైనా ఈ వింత పదార్థం గురించి సోషల్ మీడియాలో రక రకాల వార్తలు వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: