సమంత కు ఘోర అవమానం... షేమ్ ఆన్ యూ సమంత అంటూ వైరల్..!!

P.Nishanth Kumar

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సమంత ప్రస్తుతం వెబ్ సిరీస్ లలో నటిస్తుందన్న సంగతి తెలిసిందే.. పెళ్లి తర్వాత సినిమాలకు తగ్గించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఈ సిరీస్ తో పాటు గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న శాకుంతలం సినిమాలో కూడా నటిస్తుంది.. తెలుగు లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా నటిస్తూ అక్కడ మంచి మార్కెట్ ఏర్పరుచుకుని టాప్ హీరోయిన్ గా ఉంది.. అక్కినేని నాగచైతన్య ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ సినిమాలు అయితే ఎక్కువ చేయడం లేదు..

తాజాగా అక్కినేని సమంత నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ సీజన్ 2  ట్రైలర్ ఇటీవలే విడుదల కాగా దాంట్లో సమంత గెటప్ కి ప్రేక్షకులు ఫిదా అయిన విషయం అందరికి తెలిసిందే.. సెలబ్రిటీలు సైతం సమంత ను పొగుడుతూ ఎన్నో ట్వీట్ లు చేశారు.. అమెజాన్ ప్రైమ్ లో లో విడుదలైన సీరీస్ యొక్క మొదటి సీజన్ కి మంచి పేరు ప్రఖ్యాతలు రాగా రెండో సీజన్ పై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.. ఈ నేపథ్యంలోనే ఇటీవలే ఈ సిరీస్ యొక్క ట్రైలర్ రిలీజ్ కాగా ట్రైలర్ కి మంచి స్పందన ప్రేక్షకులు.. మనోజ్ బాజ్పాయ్ ముఖ్య పాత్రలో నటించిన ఈ సీరీస్ టెర్రరిజం నేపథ్యంలో తెరకెక్కగా ప్రియమణి మరో కీలక పాత్రలో నటిస్తోంది..

ఇదిలా ఉంటే అక్కినేని సమంత షేమ్ ఆన్ యూ అనే టాగ్ తో సోషల్ మీడియాలో ఆమెను అవమాన పరుస్తున్నారు కొంతమంది నెటిజన్లు.. దానికి కారణం ఆమె ఫ్యామిలీ మాన్ సీజన్ 2  లో టెర్రరిజం పాత్రలో నటించడమే అంటున్నారు..  ఈ ట్రైలర్‌లో కొన్ని సీన్లు తమిళుల మనోభావాలను కించపరిచేవిగా ఉన్నాయని సోషల్ మీడియాలో తమిళులు విరుచుకుపడ్డారు. ఈ సిరీస్‌కి వ్యతిరేఖంగా “ఫ్యామిలీ మ్యాన్-2 ఎగైనెస్ట్ తమిళ్” అనే హాష్‌ ట్యాగ్‌ను కూడా వైరల్‌ చేశారు. తమిళుల కోసం పోరాడిన లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలంకి ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థతో లింకులు ఉన్నట్లు ట్రైలర్ లో చూపించడం దారుణం అని సోషల్ మీడియాలో కమెంట్ల వర్షం కురిపిచారు. శ్రీలంకలో తమిళ వాసుల కోసం పోరాడిన LTTE అసలు టెర్రరిస్ట్ సంస్థే కాదని, సామ్ తమిళ నటి అయ్యి కూడా ఇలాంటి పాత్రలో నటించడం ఏంటంటూ సోషల్ మీడియా వేదికలపై కాస్త గట్టిగానే ఫైర్ అయ్యారు తమిళ తంబీలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: