అమెజాన్ లోకి లీనమైన ఎంజీఎం. కారణం ఏంటో తెలుసా ?
అమెజాన్ సర్వీసులు భారతదేశం అంతటా వ్యాపించి ఉన్నాయి. అమెజాన్ ఈ కామర్స్ తమ ఉత్పత్తులను వినియోగదారులకు చేరువ వేయడమే కాకుండా ప్రైమ్ ద్వారా ప్రేక్షకులకు వినోదాన్ని కూడా పంచుతోంది. అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్ లో ఓటీటీ ద్వారా విడుదలయ్యే కొత్త సినిమాలను కూడా చూడవచ్చు. అయితే ఇప్పుడు అమెజాన్ వీడియోస్ స్ట్రీమింగ్ సర్వీసును మరింత పటిష్టం చేయనుంది. అది ఎలా అంటే జేమ్స్ బాండ్ సినిమాల నిర్మాణ దిగ్గజం ఎంజీఎం ను ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్ కొనుగోలు చేయనుంది. ఇందుకోసం భారీ ఎత్తున డబ్బులు ఖర్చు ( 8.45 బిలియన్ డాలర్లు) చేస్తోంది. దీంతో తమ వీడియోస్ స్ట్రీమింగ్ సర్వీసులను కూడా మరింత పటిష్టం చేసుకోవాలని యోచిస్తోంది.
మీడియా రంగంలో నెట్ ఫ్లిక్స్, డిస్నీ హాట్ స్టార్ వంటి వినోద సేవల సంస్థలతో పోటీ పడేందుకు అమెజాన్ కు ఈ ఒప్పందం ఎంతో మేలు చేస్తుంది. అయితే అమెజాన్ ప్రైమ్ యూజర్లు చాలామంది ఉన్నారు అన్నది వెల్లడించినప్పటికీ.. అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం ఉన్న దాదాపు 20 కోట్ల మందికి అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా ప్రైమ్ వీడియో తోపాటు ఐ ఎమ్ డీ బీ టీవీ పేరుతో ఉచిత స్ట్రీమింగ్ సర్వీసును కూడా అమెజాన్ నిర్వహిస్తోంది. ఎంజీఎం కొనుగోళ్లతో రాకి,రోబో కాప్, పింక్ పాంథర్ వంటి పలు హిట్ సినిమాలు అమెజాన్ చేతికి దక్కనున్నాయి.
ఇకపోతే త్వరలో విడుదలయ్యే జేమ్స్ బాండ్ మూవీ.. "నో టైం టు డై" కూడా ఎంజీఎం నిర్మించింది. అయితే ఈ ఈ ఎంజీఎం సంస్థ మూకీ యుగం నుంచే మొదలైంది. అందులో లోగో గర్జించే సింహం వుంటుంది. మూకీ సినిమాల సమయం నుంచి సినీ ప్రేక్షకులకు ఎంతగానో అబ్బురపరిచింది.1924 లో దీన్ని ఏర్పాటు చేశారు. ఇందులో షార్క్ ట్యాంక్, ది రియల్ హౌస్ వైవ్స్ ఆఫ్ బెవర్లీ హిల్స్, వంటి రియాలిటీ టీవీ షోలను కూడా ఎంజీఎం నిర్మించింది. మరోవైపు అమెజాన్ కి కూడా సొంత స్టూడియో ఉన్నప్పటికీ ఫలితాలు మిశ్రమంగా ఉంటున్నాయి. మార్వేలస్ మిసెస్ మెయిజెల్, ఫ్రెండ్స్ ఫ్లీ బ్యాగ్ వంటి షో లు పలు అవార్డ్ లు గెలుచుకున్నప్పటికీ, చాలావరకు ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి.