వైరల్ : విచిత్ర వేలం..కనపడని శిల్పాన్నే విక్రయం..?
ఆన్ లైన్ వ్యాపారం అయినా పేవ్ మెంట్ మీద అమ్మే బొమ్మ అయినా విధానం ఒకే విధంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఇక్కడొక కళాత్మక వ్యాపారిని గురించి మీరు తెలుసుకోవాలి. సాల్వటోర్ గారౌ అనే వ్యక్తి ఇటాలియన్ కళాకారుడు. ఈయన ఒక శిల్పాన్ని వేలంలో అమ్మేశారు. శిల్పం అమ్మితే విచిత్రం ఏమిటీ అనుకుంటున్నారా. అసలు అక్కడ శిల్పం లేదు. అదృశ్య శిల్పం కొంటారా. ఈ కళ పేరు లో సోనో అంటూ ప్రచారం చేసింది. అన్నట్టు ఈ లేని శిల్పాన్ని వేలంలో ఉంచిన ఆయన దానికి ప్రారంభ ధర ఎంత పెట్టిందో తెలుసా ఆరువేల యూరోలు. మరి అక్కడ ఏమి అతనికి కనిపించిందో తెలియదు కానీ, దానిని ఏకంగా ఓ మహానుభావుడు డబుల్ అంటే 15 వేల యూరోలకు పడుకొని సొంతం చేసుకొన్నాడు. వింతగా అనిపించినా ఇది నిజం. పిచ్చి వేయి రకాలు అంటారు. అందులో ఇది కూడా ఒకటని చెప్పొచ్చు. ఇక ఈ శిల్పం విశేషాలు చాలా ఉన్నాయి. ఉనికిలో లేని శిల్పం వాస్తవానికి కనిపించదు. ఎందుకంటే ఇది చూసేవారి ఊహను సక్రియం చేసే శక్తి ఉంది.
ప్రతి వ్యక్తికి తనకి ఉన్న సామర్థ్యం ప్రకారం దాన్ని ఊహించుకోవచ్చు అని ఆ శిల్ప కళాకారుడు అంటున్నాడు. ఇక ఇక్కడ అసలేం లేదని చెబుతుంటే ఇటాలియన్ అవుట్లెట్ డియారియో తన ప్రకటనలో దీనిని శూన్యంగా భావించాలి అంటాడు. “శూన్యత శక్తితో నిండిన స్థలం కంటే మరేమీ కాదు. మేము దానిని ఖాళీ చేసి, ఏమీ మిగిలేది కాదు, హైసెన్బర్గ్ అనిశ్చితి సూత్రం ప్రకారం, ‘ఏమీ’ బరువు లేదు, అందువల్ల, ఇది ఘనీభవించిన శక్తిని కలిగి ఉంటుంది మరియు కణాలుగా, అంటే మనలోకి రూపాంతరం చెందింది ”అని ఆయన అన్నారు.
మొత్తం మీద లేని శిల్పాన్ని ఉన్నట్టుగా భావించుకోండి అని వేలం వేసిన ఆ కళాకారులకు వేలం వెర్రితొ శూన్యాన్ని కొనుక్కున్న ఆ కొనుగోలు చేసిన వారినీ చూసి ఎవరి పిచ్చి వారికి ఆనందం అనుకోవడం తప్ప ప్రస్తుతానికి చేసేదేమీ లేదు. ప్రస్తుతం ఆయన లేని శిల్పాన్ని వేలం వేయడం హాట్ టాపిక్ గా మారింది.