పెద్ద పామునే పట్టేసిన చిన్నది.. వైరల్ అవుతున్న వీడియో...

Purushottham Vinay
విషపూరితమైన పాములంటే అందరికి భయమే వీటిని చూస్తేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ముఖ్యంగా ఆడవాళ్లు పామును చూశారంటే చాలు  భయంతో కేకలు పెట్టి పరుగులు తీస్తారు.పెద్ద పెద్దగా కేకలు వేసి జనాలను కూడా బాగా భయపెట్టేస్తారు. అయితే, ఈ అమ్మాయి మాత్రం ఆ రకం అస్సలు కాదు. పాము కనపడితే చాలంట ఆమెకు నోరూరిపోవడం జరుగుతుందట.వెంటనే దాని పట్టేసుకుని వెంటనే ఇంటికి తీసుకుపోతుందట.ఇక ఆ తరువాత దాన్ని ఆ అమ్మాయి ఏం చేసి ఉంటుందో మీకు ఇప్పటికే అర్ధమయ్యే ఉంటుంది.. ఇక ఈ హారిబుల్ సంఘటన  వియత్నాంలో జరిగిందట. మరి ఆ సంఘటన ఏంటో తెలుసుకుందామా...వియత్నాంలో వియత్ ట్రై అనే చోట రోడ్డు మీద వెళ్తున్న ఓ అమ్మాయి రోడ్డు మీద ఓ పెద్ద పాము పాక్కుంటూ వెళ్లడం చూసిందట.


దీంతో ఆమె ఆ పామును ఎలాగైనా పట్టుకుని ఇంటికి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకుందట. చెట్ల పొదల్లోకి వెళ్లిపోతున్నా ఆ సర్పంను ఆమె ఏమాత్రం భాయ్ లేకుండా పట్టేసుకోవడం జరిగింది. ఇక అటు వైపు కారులో పోతున్న ఓ వ్యక్తి ఇదంతా చూసి మొబైల్ ఫోన్‌లో రికార్డు చేశాడట.ఇక అతను ఆమెకు జాగ్రత్తలు చెబుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆ మహిళ పట్టువీడలేదట.ఇక ముందుగా ఆ అమ్మాయి పాము తలను పట్టుకోవడం జరిగింది.ఇక ఆ విష సర్పం ఆమె చేతుల నుంచి తప్పించుకోడానికి చాలా రకాలుగా ట్రై చేసింది. ఆ పాము కొద్ది సేపు తప్పించుకోవాలని విలవిల్లాడింది.


 దీంతో ఆ అమ్మాయి ఆ పాము మధ్య భాగాన్ని పట్టుకుంది. ఆ తర్వాత కార్లో నుంచి చూస్తున్న ఆ వ్యక్తిని పట్టించుకోకుండా ఆమె దారిలో ఆమె వెళ్లిపోయింది. ఆ పాము ఆ అమ్మాయి నడుమును చుడుతున్న కాని ఆమె ఏమాత్రం భయపడకుండా..ఆమెకు అది వెన్నతో పెట్టిన విద్య అన్నట్లు వ్యవహరించడం జరిగింది. ఇక మీకు ఆ వొళ్ళు గగుర్పొడిచే ఘటన చూసే ధైర్యం ఉన్నట్లయితే .. ఈ కింద వున్న వీడియోని ఒకసారి చూడండి.





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: