తెలంగాణలో వింతగా అరుస్తున్న పాము...? నిజమెంత..?
ఇక ఆ వీడియో నిన్నటినుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఇక సాటిలైట్ల్స్ ఛానల్స్ లో అలాగే కొన్ని వార్తా పత్రికల్లో దీని గురించి కవరేజ్ ఇవ్వడంతో జనాలు తెగ భయపడుతున్నారు. కాని ఆ పాము అరవడంలో ఎలాంటి నిజం లేదట. ఇదంతా ఒట్టి ఫేక్ న్యూస్.దీన్ని ఓ ఆకతాయి యువకుడు వైరల్ చేశాడు. నిజానికి ఇలాంటి అరిచే పాములు అస్సలు చాలా అరుదుగా ఉంటాయట. పైగా ఇలాంటి పాములు మనదేశంలో ఉండవట. ఇక ఆ యువకుడు షేర్ చేసిన ఆ వీడియో పోలీసుల దృష్టికి వెళ్ళింది. ఇక ఈ ఘటన తెలుసుకున్న పోలీసులు ఈ పాము వీడియో తీసిన ఆ యువకుడిని పట్టుకొని విచారణ చేపట్టి నిజం తెలుసుకున్నారట. ఈ విచారణలో ఆ ఆకతాయి షాకింగ్ న్యూస్ చెప్పాడు.
ఇది సరదా కోసం చేశాడట కాని ఆ పాము అలా వింతగా అరవడంలో ఎలాంటి నిజం లేదట. మరో షాకింగ్ న్యూస్ బయటపడింది.ఈ విషయాన్ని స్థానిక ఎస్సై వివేక్ బయటపెట్టాడు.ఈ వీడియోని నెల రోజుల క్రితం మైక్ మార్టిన్ అనే ఓ ఫారెన్ యూట్యూబర్ "hognose hits the high notes" అనే పేరుతో అప్ లోడ్ చేశాడని ఎస్సై వివేక్ తెలిపాడు.ఆ వీడియోను వెలిచాల గ్రామంలోదిగా పేర్కొంటూ ఓ ఆకతాయి సోషల్ మీడియాలో తప్పుడు పోస్ట్ చేశాడని అన్నారు.ఆ యువకున్ని మరింతగా విచారిస్తున్నామని ప్రజలు ఎవ్వరు ఆందోళన చెందొద్దని వివేక్ తెలిపారు.కాబట్టి ఇది పక్క ఫేక్ న్యూస్.చూశారుగా నిజ నిజాలు తెలుసుకోకుండా కొన్ని వార్త పత్రికలు రాసిన వార్తలు గుడ్డిగా నమ్మేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తే ఇలాంటి అనార్ధాలే జరుగుతాయి.
ఇక మైక్ మార్టిన్ నెల రోజుల క్రితం అప్లోడ్ చేసిన వీడియో ఇది మీరు చూసేయండి.
https://youtu.be/_CTIiln4sPs