వైరల్ : మనిషి రూపంలో మేక పిల్ల జననం...!
మొన్నటికి మొన్న హిమాచల్ ప్రదేశ్‌లో రావిచెట్టుకు మామిడి పండ్లు కాసాయంటూ ఒక ఫొటో సోషల్ మీడియాలో ఎన్నో చెక్కర్లు కొట్టింది. కానీ చివరకు అది ఫేక్ అంటూ క్లారిటీ వచ్చింది. కానీ కొన్ని ఘటనలు మాత్రం నిజంగానే జరుగుతుంటాయి. తవ్వకాల్లో దేవుడి ఆకారంలో విగ్రహాలు బయటపడటం, కొబ్బరి చిప్పలో వింత ఆకారాలు కనిపించడం, కొన్ని కాయలు దేవుడి రూపంలో ఉండటం లాంటివి నిజంగానే చాలా వరకు జరిగాయి.
ఇక జంతువుల్లో అయితే ఇలాంటి కోకొల్లలు. ఒక జంతువుకు ఇంకో జంతువు ఆకారంలో ఉన్న పిల్లలు పుట్టడం, లేదా ఒకే జంతువుకు రెండు తలలు, లేదా వింత ఆకారంలో పుట్టడం లాంటివి ఎన్నో వీడియోలు మనం చూసే ఉంటాం.ఇ క ఇప్పుడు కూడా అలాంటి వింత ఘటనే ఒకటి జరిగింది. అది కూడా జంతువుల్లోనే జరిగిందండోయ్. అదేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
వాస్తవానికి వింత ఆకారంలో ఆవు దూడలు, మేక పిల్లలు పుట్టడం చాలా కామన్‌గానే జరుగుతుంటాయి. ఇక తాజాగా ఇలాంటి ఘటన నిర్మల్ జిల్లాలో చోటు జరగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. భైంసా మండలం సుంక్లి గ్రామంలో ఓ వ్యక్తకి చెందిన మేకకు వింత మేకపిల్ల జన్మించింది. అచ్చం మనిషిని పోలినట్టు ఉంన్న పిల్లను మేక ప్రసవించించింది. ఆ మేక పిల్లకు తల , కాళ్లు, చేతులు అచ్చం మనిషిని పోలినట్టే ఉన్నాయని తెలుస్తోంది. ఇక ఈ సమాచారం తెలుసుకున్న స్థానికులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆ వింత మేక పిల్లను చూడటానికి ఎగబడి తరలిస్తువస్తున్నారు. కాగా ఈ వింత మేక పిల్ల పుట్టిన కొద్ది సేపటికి ప్రాణాలు విడిచిందని తెలుస్తోంది. ఇలాంటి వింత శిశువు జన్మించడానికి జన్యు ఉత్పరివర్తనాలు కారణం కావచ్చని చెబుతున్నారు పశువైద్య డాక్టర్లు.